Vastu Purushudu

వాస్తుపురుషుడు

కన్నడ మూలం
డా|| జి. జ్ఞానానంద
అనువాదం
కందుకూరి వేంకట సత్య బ్రహ్మాచార్య

198.00

Share Now

Description

వాస్తుపురుషుడు ‌‌వాస్తు పురుషుడు ఎవరు? అని అడిగిన వెంటనే ఆయన ఒక రాక్షసుడు. శివుడి చెమటబొట్టు నుంచి ఉద్భవించాడు. ఆయనను దేవతలంతా కిందకు పడదోసి అతని శరీరంపై కూర్చున్నారు. అని ఓ పురాణ కథ చెప్పడం మొదలు పెడతారు.వాస్తుపురుషుడు ఓ నలుచదరమైన మండలంలో ఈశాన్యానికి తలపెట్టుకుని పడుకుని ఉంటాడు.ఆయన సూర్యుడిలా తిరుగుతూ ఉంటాడు. చాలా మందికి తెలిసిన ప్రాథమిక పరిజ్ఞానం ఇదే.
పేరేమో వాస్తు పురుషుడంటున్నారు.వివరం అడిగితే రాక్షసుడు అంటున్నారు.ఇంతకీ ఆయనెవరు?ఆయన ఎలా ఉంటాడు? ఆయన్ని ఏ రూపంలో పూజించాలి? ఇతడు పురాణపురుషుడా? లేక వేదకాలానికి చెందిన దేవుడా? లేక నరుడా? ఇంతకీ వేదాలు,వాస్తుశాస్త్రాలు, శిల్పశాస్త్రాలు ఈయన గురించి ఏం చెప్పాయి.
ఆగమాలలో,కల్పసూత్రాలలో మాత్రం వాస్తుమండలం లిఖించి పూజించమని చెప్పాయి.దానినే వాస్తుపూజ అని చెప్పాయి.ప్రతి కార్యక్రమంలో ఈయనను పూజించమని,బలి ఇవ్వాలని చెప్పాయి.ఆ వాస్తు మండలం ఎందుకు పూజిస్తారు? అందులో ఉన్న దేవతలెవరు? వారంతా దేవతలేనా? ఇంతకీ ఆ వాస్తు మండలం పూజకు తప్ప మరెందుకూ పనికి రాదా?
భూమిపై నిర్మించే చిన్న ఇల్లు మొదలు పెద్ద పెద్ద భవంతులు-అంతఃపురాలు-ఆలయాలు-కోటలవరకూ, గ్రామం మొదలు నగరం వరకూ నిర్మించడానికి మూలసూత్రం ఏమిటి? ఇంతవరకూ నిర్మించినవన్నీ దేన్ని అనుసరించి కట్టారు? దానికేమైనా ఆధారం ఉందా?
విగ్రహం చెక్కే ముందు ఆ శిలపై ఒక కోష్ఠకం లిఖిస్తారట.అసలు కోష్ఠకం అంటే ఏమిటి? అదెలా లిఖిస్తారు? ఇది లేకుండా విగ్రహాన్ని తయారు చేయడం సాధ్యం కాదా?
యజ్ఞమండపం ఎలా కడతారు? యజ్ఞవేదికలు ఎన్ని ఉండాలి? ఎన్ని స్తంభాలతో కట్టాలి? ఎన్ని ద్వారాలు ఉండాలి?
పై విషయాలకీ వాస్తుపురుషుడికీ ఏమిటి సంబంధం?
పై ప్రశ్నలకే కాక మరెన్నో విషయాలను సాధికారికంగా,విశ్లేషణాత్మకంగా తెలుపుతూ వాస్తు పురుషుడిపై చేసిన అధ్యయనం ఫలితంగా త్వరలో ..తెలుగులో..వెలువడబోతున్న మా గ్రంథం “వాస్తుపురుషుడు”.
తెలుగులో వాస్తు పురుషుడిపై వెలువడుతున్న మొట్టమొదటి పుస్తకం.”వాస్తు పురుషుడు”
వాస్తుపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ, ఆగమికులు, జ్యోతిష్కులు,స్థపతులు, పండితులు,ధార్మికులు,ఆస్తికులు,పురోహితులు,శిల్పులు, ఇంజనీర్లు,చదవాల్సిన పుస్తకం.
ముందస్తుగా ఈ పుస్తకాన్ని రిజర్వు చేసుకోండి.
పుస్తకం కోసం …

Vastu Purushudu
వాస్తుపురుషుడు

కన్నడ మూలం
డా|| జి. జ్ఞానానంద
అనువాదం
కందుకూరి వేంకట సత్య బ్రహ్మాచార్య

Tags: Vaastupurusudu Color, Dr. G. Jnanananda, Kandukuri Venkata Satya Brahmacharya