Rasaratna Samuchayam

రసరత్న సముచ్చయం

360.00

Share Now

Description

వాగ్భటుడు ఒక సుప్రసిద్ద భారతీయ ఆయుర్వేద వైద్యుడు.

ఈ గ్రంథమును వాదవిద్యకు సంబంధించిన విషయములను, వైద్యవిద్యకు సంబంధించిన విషయములను కలిసియుండుటచే స్వయముగా కొన్ని ప్రక్రియాలను చేసిచూచినగాని సంశయమువీడలేదు. మరికొన్ని వృద్ధులవలనను, కొన్నిటిని తంత్రాంతరములవలనను తీర్చు కొనదగిన సంశయములున్నవి. మన దేశమున వాదవిద్యయందు పనిచేసినవారును, చేయుచున్నవారును, ఆసక్తికలవారును కలరు. కాని సంపూర్ణసిద్ధినిబడసిన వారెవరైనా నుందురో! యేమో! కారణమేమన, కొందరు తామ్రాదులందురంగును కల్గించగలరు. మరికొందరు బరువెక్కింపగలరు. మరికొందరు గీటు తెప్పించగలరు. కాని అందరకు అన్నీ విషయాలు తెలియవు. ఒకరికి తెలిసినదానిని ఇంకొకరికి వారు చెప్పరు. అందుచే నీ విద్య యేరికిని సాధ్యపడుచుండుటలేదని నా అభిప్రాయము. అందుకే నాకు ఎరిగినంతవరకు పెద్దల ఉపదేశములను, స్వానుభూత ప్రక్రియలను అచ్చుపడక మూలమూలాల దాగిన “వాదమంజరి” మున్నగు గ్రంథస్థములగు కొన్ని విషయములను ఈ గ్రంథములో వ్రాసినాను.  – చి. సత్యనారాయణ శాస్త్రి