Description
Vastuguna Prakasika Book
వస్తుగుణ ప్రకాశిక
Author : Sri Veeturi Vasudeva Shastri
Pages : 1248
vastu guna prakasika vastu guna prakashika
శతాయుష్మాన్ భవ! – అంటే వందేళ్ళు జీవించమని పెద్దల దీవెన. అందరూ ఆనందంగా ఆయురారోగ్యభాగ్యాలతో తులతూగాలనేది కూడా ఒక గొప్పదైన శుభాకాంక్ష. నిండు నూరేళ్ళు హాయిగా బ్రతకడానికీ, వీలైతే ఇంకా ఎక్కువకాలం జీవించి సర్వవిధ సౌఖ్యాలు, ధర్మార్ధకామ మోక్షాలూ అన్నీ అనుభవించడానికి, ఎన్నెన్నో మానవ విజయాలు సాధించడానికి, నియమాల నిబద్ధతతో జీవించడానికి శతాబ్దాలుగా నిలచింది భారతీయ వైద్య శాస్త్రం. వ్యాధిని తాత్కాలికంగా నివారింపజేయడం కాక ఆ వ్యాధి మూలాలను వ్రేళ్ళతో సైతం పెకలించి, స్ధిరమైన, శాశ్వతమైన ఆరోగ్యాన్ని వృద్ధి చేయడం భారతీయ వైద్యశాస్త్ర పరమార్థం.
అల్లోపతి కావచ్చు, ¬మియోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు – ఈ వైద్య రంగాల వైద్యులందరికీ కావలసినది, ఉండి తీరవలసినది ఆహార సంబంధమైన సర్వవస్తు సంబంధమైన పరిజ్ఞానం. ఇదిగో, ఇందుకై మీ ముందుకు వచ్చి మీ చేతిలో నిలచిన మ¬త్తమ గ్రంథం – ఈ వస్తుగుణ ప్రకాశిక. ఒకటికాదు, సవాలక్ష వస్తువుల గుణాలు ఈ గ్రంథంలో ప్రకాశిస్తున్నాయి.
సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపులు, అభినవ ధన్వంతరీ మూర్తులు అయిన వైద్యులకు ఇది ఒక కరదీపిక. ఎన్నో దశాబ్దాలుగా కీర్తిపొంది, వైద్యభాషా వినియోగ పదకోశమా! అన్నంతపేరు గడించింది ఈ గ్రంథరాజం.
శతాబ్ధాల తరబడి భారతీయ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి, సాధించిన వైద్య ఫలిత గుణాలు ఇందులో పొందుపరచబడ్డాయి. అంతేకాదు చరకము, వాగ్భటము, నడకర్ణి, సుశ్రుతము ఇటువంటి ప్రాచీన వైద్య మహాగ్రంథాల పరిశోధనాఫల స్వరూపం ఈ వస్తుగుణ ప్రకాశిక.