Quantity of product Kalachakram Gantala Panchangam 2027-2028 can not be more than 1

Mesha Lagnam

మేష లగ్నం
Author: Pucha Srinivasa Rao
Pages: 164

99.00

Share Now

Description

Mesha Lagnam Book

Author: Pucha Srinivasa Rao
Pages: 164
ద్వాదశ రాశులను గురించి లేదా ద్వాదశ లగ్నాల గురించి భారతీయ భావనలు ఎలా ఉన్నాయి. పాశ్చాత్యుల ఉద్దేశాలు ఎలా ఉన్నాయో తెలియజేసే రచనలు తెలుగులో లేవనే చెప్పవచ్చును. రాశీ ఫలితాలు, పరిహారాలను గురించి తెలియజేసే పుస్తకాలున్నా ఖగోళం ఆ రాశీ స్వరూపం ఏమిటి, పాశ్చాత్యులు భావనలు ఎలా ఉన్నాయి వారు ఈ లక్షణాలను ఎలా విశ్లేషించారు అనే విషయాలు మనకు పెద్దగా తెలియవనే చెప్పాలి. దీనిని దృష్టిలో పెట్టుకొని అందరికి ఉపయోగపడేలా అంటే ఆయా లగ్నాలవారికి, ఆయారాశులు చంద్రదాశులవారికి, సౌరమానం ప్రకారం ఫలితాలు సరిపోయేలా ఈ రచనను ప్రణాళిక చేయబడి ఈ నాటికి మీ చేతులలోకి వచ్చింది.
రాశీ చక్రంలో మొదటిరాశిగా చెప్పుకొనేది మేషరాశి. ప్రారంభం నుండి 300 వరకు అవధి కలిగిన ఈ రాశిలో అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదము మొత్తము 2 నక్షత్రాలు పూర్తిగా మూడవ నక్షత్రములోని 1పాదము ఉన్నాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం ఏప్రియల్ 14 – మే 14 మధ్యలో పుట్టిన వారిని మేషరాశి జాతకులుగా చెప్పబడ్డారు.
మీరు మేష లగ్నం, మేషరాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు
1. మీ అభిప్రాయాలు పెద్దగా పట్టించుకోకపోయినా
2. మీరు సాహసవంతులు, దుడుకు స్వభావం కలిగినవారైనా
3. చిరుతిళ్ళు ఇష్టపడే వారైనా
4. ఎప్పుడూ పెద్దగా బోరు ఫీలవ్వని వారైనా
5. తొందరగా ఆవేశపడే వారైనా
6. అందరికంటే ముందు ఉండాలనుకునే వారైనా
7. అందరితో పాటే నేను అనుకునే వారైనా
8. మంచి సలహాలు చెప్పగలిగిన వారైనా
9. అమసరమైన వాటిని సీరియస్‌గా తీసుకోనివారైనా
10. ముక్కుసూటిగా ఉండే వారైనా …
మీరు తప్పకుండా మేషరాశివారే … ఇక పుస్తకం చదవండి….