Description
డబ్బు – ఒక శక్తి ప్రవాహం
Money Mantra Mind Mantra
మీ నిలకడైన, క్రమబద్ధమైన ఆదాయంలో ఏ ‘కుదుపు’ రాకూడదని మీరు అనుకుంటే మాత్రం ఈ పుస్తకం చదవకండి. ఎందుకంటే మీ జీవితాన్ని మరింత మెరుగుపరచగల కుదుపునిచ్చే సమాచారంతో ఈ పుస్తకం నిండి ఉంది!
ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సగటు మనిషి యొక్క పరుగు, ప్రయత్నం, ఆలోచన అన్నీ డబ్బుకోసమే. డబ్బుకోసం పరిగెడుతున్నారు సరే కానీ, డబ్బు గురించి మీకేం తెలుసో మీకు తెలుసా?
కొన్ని ప్రశ్నలు :
* అసలు “డబ్బు” అంటే ఏమిటి? డబ్బుకి, మనిషికి ఉన్న సంబంధమేమిటి?
* మీరు ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రేరణ పొందినా డబ్బు సంపాదించడం మాత్రం కష్టంగా అనిపిస్తుందా? ఎందుకు?
* డబ్బుకోసం కష్టపడేవాళ్ళు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. ఎందుకో తెలుసా? ? డబ్బున్నవాళ్ళకు మీరు కాస్త దూరంగా ఉంటారా? ఎందుకలా?
*ధరలు పెరగడానికి అసలు కారణమేమిటి? ఏం జరిగితే ఆ ధరలు తగ్గుతాయి?
*మీ దగ్గర తగినంత డబ్బు లేకపోవడానికి కారణం ఎవరో మీకు తెలుసా?
*అన్నింటికంటే లాభసాటైన మరియు లాభాన్ని తప్ప నష్టాన్ని ఇవ్వని ఉత్తమమైన పెట్టుబడి ఏమిటో మీకు తెలుసా?.
* మీకు మరింత డబ్బు కావాలంటే మీరు పెంచాల్సిన ‘డోస్ (Dose) ఏంటో తెలుసా? ? డబ్బు నిజంగా చెడ్డదా? అది మనిషి యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి అద్దా?
* మనమంతా సంతోషంగా ఉండాలంటే మనందరి దగ్గర బోలెడు డబ్బుంటే సరిపోతుందా? ? డబ్బే మీ జీవిత లక్ష్యమా? మీరు పరిగెడుతుంది నిజంగా డబ్బుకోసమేనా?
* ఒకవేళ ఈరోజే మీ జీవితంలోని ఆఖరి రోజు అయితే మీరేం చేస్తారు? ? 100/- 10000/-..! ఎలా? (వంద రూపాయల విలువ పదివేల రూపాయలకంటే ఎక్కువ!
ఎలా?)
కొన్ని వాస్తవాలు:
** మీరు సంపన్నులు కావాలంటే డబ్బుకోసం పనిచెయ్యడం మానండి. డబ్బు గురించి తెలిస్తే, డబ్బు నోట్ల వైపు మీరు సరిగ్గా చూడనైనా చూడరు! మీకు నిజమైన
బోలెడు డబ్బున్నవాళ్ళంతా సంపన్నులు కారు! డబ్బుతో స్నేహంగా వ్యవహరించడం గొప్ప ఫలితాలనిస్తుంది.
అసలు కిటుకు అర్థమైతే డబ్బు సంపాదించడం నిజంగా సులభం! “డబ్బు” అనేది కేవలం ఒక నీడ!
ఇటువంటి ఆలోచింపజేసే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలతోపాటు, డబ్బుకు సంబంధించిన ఇటువంటి సూక్ష్మ వాస్తవాలెన్నింటినో మీరు ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటారు.
మీరు డబ్బును మాత్రమే కాకుండా, సంపదను కూడా కోరుకుంటుంటే గనుక ఈ పుస్తకం మీ కోసమే. మీరు సంపద కోసం పరుగు పెట్టకుండా. మీ దగ్గరకే సంపదను తీసుకొచ్చే సైన్సు గురించి తెలుసుకోండి. పరుగు ఆపి ప్రశాంతతను, ఆనందాన్ని అనుభవించండి.