Description
Vasista Samhita Book
భారతీయ జ్యోతిశ్శాస్త్ర విజ్ఞానము, ప్రపంచ విజ్ఞానములలో అగ్రగణ్యము. ఈ శాస్త్రమును వశిషస, కశ్యప గర్గాది మహామునులు 18 మంది భూలోకమున విస్తరింపజేసిరి.
సంహితాగ్రంథములు కూడా 18 గలవు. అనేక కారణములవలన మనకిప్పుడు ఐదారు సంహితలు మాత్రమే లభించుచున్నవి.
వీనిలో ప్రధానమైనది వశిష్టసంహిత. దీనినే జగన్మోహన గ్రంథమందురని తొలి అధ్యాయము 3వ శ్లోకములో చెప్పబడినది.
జ్యోతిష విజ్ఞాన భాస్కరులు, వాస్తుకళానిధి,స్వర్ణాభిషేక విరాజితులు, రాష్ట్రపతి పురస్కార గ్రహీతలు, మహామహోపాధ్యాయ బిరుదాంకితులు అగు బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రిగారు అస్మద్గురువర్యులు.
వారి ఆశీర్బలముతో నేనీ గ్రంథంమును యధామతిగా తెలుగులోనికి అనువదించితిని.
ఈ గ్రంథమున అనేక విషయములు సవిస్తరముగా వివరింపబడినవి.
విషయకాఠిన్యమున్నచోటులలో పట్టికలు, చిత్రముల ద్వారా వివరింప ప్రయత్నించితిని.
నిత్యములో వాడుకలో లేని కొన్నింటిని పరిహరించితిని.కొన్నింటిని ఇతర గ్రంథముల నుండి సేకరించి యిందు పొందుపరచితిని. పాఠకులకు సులభముగా విషయము తెలియుటకు చేసిన యీ ప్రయత్నము.
– మారేపల్లి రామవీరేశ్వర శర్మ