Description
Muhurtha Vallari Book
జ్యోతిషశాస్త్రములో ప్రముఖమైనది ముహూర్తభాగము. ఈ దేశములో దాదాపు అందరు ఏ పని ప్రారంభించడానికైనా మంచి ముహూర్తము కొరకు సంప్రదించడము తెలియని విషయముకాదు. పూర్వ ఋషుల అభిప్రాయము ప్రకారము దుఃఖమును తరించుటకు, సుఖమును పొందుటకు యజ్ఞయాగాదులు, జపతపాదులు ఫలసిద్ధి కారి యగు కాలమున ఆచరించవలెను.
ఆ ఫలసిద్ధియగు కాలమే ముహూర్తము. వేదకాలము నుండి నారదాది మహాఋషులు ద్రష్టలై, స్రష్టలై అనేక సంహింతలను రచించారు. వాటిలో ముహూర్త విషయాలు చర్చించబడినాయి. మరి ఈ ముహూర్త వల్లరి ప్రయోజనము ఏమని ప్రశ్నవచ్చును. సంహితలయందు నారదాది ఋషులచే చెప్పబడిన విషయములను, ముహూర్త చింతామణి, కాలామృతాది గ్రంథముల యందు చెప్పబడిన విషయములను క్రోడీకరించి, తార్కికమైన క్రమమున సామాన్యులకు కూడా అర్థ మగునట్లు వివరించు ప్రయత్నమే ఈ రచన.