Manasara Vastu Sastram telugu

Dr. pedapati nageswara rao
మానసార వాస్తు శాస్త్రం

    – డా. పెదపాటి నాగేశ్వరరావు

1,116.00

+ Rs.90/- For Handling and Shipping Charges
Share Now

Description

Manasara Vastu Shastra

సంపాదకులు & అనువాదకులు
మహామహోపాధ్యాయ డాక్టర్ పెదపాటి నాగేశ్వరరావు

• శ్రీ మానసార మహర్షిచే రచించబడిన ప్రాచీన వాస్తు-శిల్పాలకు సంబంధించినది.
• ప్రాచీన వాస్తు-శిల్పగ్రంథాలలో కాశ్యపం, మయమతం, మానసారగ్రంథాలను రత్నత్రయాలంటారు.
• ఆసేతు హిమాచలం బృహత్తర ఆలయాలు, రాజహర్మ్యాలు, సేతువులు, ఉద్యానాలేన్నో ఈ గ్రంథం ఆధారంగా నిర్మించినవే.
• మానం అంటే కొలత. సారం అంటే సమస్త నిర్మాణాలకు సంబంధించిన కొలతల సారమే ఈ గ్రంథం.
• ఈ గ్రంథంలో శిల్పాచార్యలక్షణంతో మొదలై మానోపకరణం వంటి 70 అధ్యాయాలున్నాయి.
• విశ్వకర్మ, విశ్వేశుడు, విశ్వసారుడు మొదలైన 32 మంది శిల్పరులున్నారని చెప్పింది.
• సమస్త శుభనిర్మాణాలకు ప్రశస్తమైన భూమిని ఎంచి, పరీక్షించి స్వీకరించే విధానం చెప్పింది.
• శంకుస్థాపన చేసి, పదవిన్యాసంతో ఆ
భూమిని విభజించి
వాస్తుదేవతాపూజ, బలికర్మ చెప్పింది. • 8రకాల గ్రామాల నిర్మాణవిధానం, గ్రామంలోని ముఖ్య నిర్మాణాలను ఎక్కడ, ఎలా చేయాలో చెప్పింది.
• భూపతి, మండలేశుడు, పట్టధరుడు మొదలైన అధికారులకు తగిన నగరాలు, కోటల నిర్మాణం చెప్పింది.
• ఎవరెవరికి ఎన్ని అంతస్థుల నిర్మాణం చేయాలి? భూమిలో చేయాల్సిన గర్భవిన్యాసవిధి చెప్పింది.
• ఆలయనిర్మాణానికి ముందు చేసే 8రకాల
ఉపవీఠాలు, 36రకాల అధిష్ఠానాలను గురించి చెప్పింది.
మానసార వాస్తుశాస్త్రం
• ఆలయం, మండపాలకు కావాల్సిన స్తంభాల లక్షణం, ప్రస్తరలక్షణం, సంధికర్మవిధానం గురించి చెప్పింది.
• దేవతలకు నిర్మించే ఆలయాల విమానం కొలతలు, 1 నుంచి 12 అంతస్తుల విమానలక్షణాలు గురించి చెప్పింది. • ఆలయం చుట్టూ రక్షణకై నిర్మించే పంచప్రాకారాలను, ఆ ప్రాకారంలో
ఉండాల్సిన నిర్మాణాలను గురించి చెప్పింది. • ప్రాకారాల లోపల శివ, విష్ణు ఆలయాలలో ఉండాల్సిన పరివారదేవతా లక్షణాలు, స్థానాన్ని గురించి చెప్పింది.
• ప్రాకారానికి నలుదిక్కులా ఎత్తుగా నిర్మించే గోపురాలను అంతస్తులను బట్టి 15రకాల గోపురాల గురించి చెప్పింది.
• దేవతలకు, ద్విజులకు వాసయోగ్యమైన మండపాలను గురించి, వాటి ఉపయోగాన్ని గురించి చెప్పింది.
దేవతలు, అన్ని వర్ణాలవారు నివసించడానికి అనువైన శాలా (గృహములు) నిర్మాణం గురించి చెప్పింది.
గృహంలో వంటిల్లు, భోజనగది, పడకగది మొదలైనవి ఏవేవి ఎక్కడ ఉండాలి? అనే గృహవాస్తు గురించి చెప్పింది. సలక్షణంగా నిర్మించిన గృహంలో గృహప్రవేశం ఎలా చేయాలో అందులోని
విధులను గురించి చెప్పింది.
• ద్వారాలను ఎక్కడ ఉంచాలి? కిటికీలు ఎక్కడ ఉండాలి? ద్వారానికి ఉండాల్సిన స్తంభాల గురించి చెప్పింది. రాజాంతఃపుర లక్షణం, రాణీవాసం, ఆయుధాగారం, కోశాగారం మంత్రి- సామంతుల నివాసాల గురించి చెప్పింది. • రాజుకుండాల్సిన లక్షణాలు, రాజుకు, రాజ్యానికి ఉండాల్సిన రక్షణ వ్యవస్థ, సైన్యం
మొదలైన విషయాలను చెప్పింది.
శిల్పకళాభారతి
శిల్పమూలాని
• రాజులు బలాన్ని బలగాన్ని బట్టి 9రకాలనీ, వారి వస్త్రాలంకరణ తీసుకోవాల్సిన పన్ను గురించి చెప్పింది.
• దేవతలు, బ్రాహ్మణులు, రాజులు
మొదలైనవారు ఎక్కి తిరిగే రథాలు వాటి లక్షణం గురించి చెప్పింది.
• అన్ని వర్ణాలవారు ఉపయోగించే శయనం గురించి, రాజు అధిరోహించే సింహాసనం
గురించి చెప్పింది.
• దేవతలు, రాజుల గృహాలకు అలంకారమైన తోరణాలు, ముత్యాల పందిళ్లు, కల్పవృక్షం గురించి చెప్పింది.
• దేవతలకు రాజులకు తగిన శిరోఆభరణాలైన కిరీటాలు, శరీరంపై ధరించే ఆభరణాలు
గురించి చెప్పింది.
• త్రిమూర్తుల లక్షణం, శివలింగ లక్షణం, పీఠలక్షణం, శక్తిదేవతా లక్షణం, జైన, బౌద్ధ దేవతా లక్షణం గురించి చెప్పింది. • ముని, యక్షవిద్యాధర, భక్తమూర్తుల విగ్రహలక్షణాలూ, హంస, గరుడ,
వృషభ,సింహవాహన లక్షణం గురించి చెప్పింది. • దేవతావిగ్రహ నిర్మాణంలో అనుసరించే ఉత్తమ,మధ్యమ దశతాల కొలతలను, ప్రలంబలక్షణం గురించి చెప్పింది. • లోహవిగ్రహాలను తయారుచేయడానికి మధూచ్చిష్టవిధానం, విగ్రహాలు అలక్షణంగా ఉంటే కలిగే నష్టాలను చెప్పింది. • దేవతా విగ్రహాలకు కళ్లు తెరిచే నయనోన్మీలన విధానాన్ని అందులో శిల్పాచార్యుడు
చేయవలసిన విధులను చెప్పింది.
• శిల్పాచార్యులు, ఆగమీకులు, పండితులు, పురోహితులు, జ్యోతిష్కులు, నిర్మాణ, వ్యాపార రంగాలవారికి ఈ గ్రంథం వరం.      – కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య

మనసారా
అధ్యాయం పద్యాలు అంశాలు [18]
1 40 saṃgraha: విషయాల సంక్షిప్త జాబితా (ప్రధానంగా హిందూ విషయాలు, 31-32 శ్లోకం జైన మరియు బౌద్ధ కళలను ప్రస్తావిస్తుంది)
2 80 శిల్పి-లక్షణం: వాస్తుశిల్పుల అర్హతలు, మనోపకరణం: కొలత వ్యవస్థ
3 34 వాస్తు-ప్రకరణ: నిర్మాణ వస్తువులు
4 42 bhūmi-saṃgraha: నిర్మాణ స్థలం ఎంపిక
5 91 భూపరీక్ష: మట్టిని పరీక్షించే విధానాలు
6 120 śaṅku-sthāpana-lakṣaṇa: పిశాచాలు మరియు పెగ్‌ల కోసం నియమాలు
7 271 padavinyāsa-lakshaṇa: గ్రౌండ్ ప్లాన్స్
8 88 బలికర్మ: ప్రణాళిక మరియు నిర్మాణానికి ముందు నైవేద్యాలు మరియు పూజ
9 538 గ్రామ: గ్రామ ప్రణాళిక
10 110 నగర: పట్టణ ప్రణాళిక
11 145 భూమిలాంబ: భవనం కొలతలు
12 217 గర్భవిన్యాస: భవనం పునాది
13 154 ఉపపీఠం: స్తంభాల పీఠం
14 412 అధిష్ఠానం: నిలువు వరుసల ఆధారం
15 437 స్తంభం: నిలువు వరుసలు
[…] […] [జోడించాలి]
40 158 రాజహర్మ్య: రాజభవనం
41 51 రాజాంగ: రాజ పరివారం
42 82 రాజలక్షణ: రాజ చిహ్నం
43 170 రథాలక్షణం: రథాలు మరియు రథకార్లు
44 85 సయన, పర్యాంక, మంకా: మంచం, పడకలు మరియు ఊయల
[…] […] [జోడించాలి]
51 94 త్రిమూర్తి: బ్రహ్మ, విష్ణు మరియు మహేశ
52 376 లింగం: శైవ చిహ్నం
53 60 పీఠ-లక్షణ: హిందూ దేవాలయ చిత్రాలు, దేవతలకు సహాయక నిర్మాణం
54 192 శక్తి-లక్షణ: హిందూ దేవాలయ చిత్రాలు, స్త్రీ దేవతలు
55 94 జైన-లక్షణ: జైన ఆలయ చిత్రాలు
56 18 బౌద్ధ-లక్షణ: బౌద్ధ ఆలయ చిత్రాలు
57 60 muni-lakshaṇa: ఋషుల చిత్రాలు
58,59 …… ……..
70 118 నయనోన్మిలన: కంటి ఉలికి నియమాలు