Dwadasa Jyotirlinga Mahatyam

ద్వాదశ జ్యోతిర్లింగ మాహాత్మ్యం

100.00

Out of stock

మీ ఈమెయిల్ ఇచ్చిన యెడల, పుస్తకము స్టాక్ వచ్చిన వెంటనే మీకు ఈమెయిల్ పంపగలము

Share Now

Description

శివుడు లేని చోటే లేదు. ఆయనే ఈ విశ్వాన్ని రక్షిస్తున్నాడు. ప్రత్యేకించి ఆ జ్యోతిర్మయుడు ఆయా సిద్ధ క్షేత్రాలలో ప్రకటమై మన దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడుతున్నాడు. సర్వపాపాలనూ భస్మం చేసి ఇహపర భోగాలను సమకూర్చి, కైవల్యాన్ని ప్రసాదించే శక్తి శివలింగార్చనకు ఉంది. అందులోనూ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనంతో జన్మ ధన్యమవుతుంది. భారతదేశంలో పేరెన్నికగన్న శైవక్షేత్రాలలో మహామహిమాన్వితమైన స్వయంభూ లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు. జ్యోతిస్వరూపుడైన ఆ పరమేశ్వరుడే భక్తులను ఉద్ధరించడం కోసం ఆయా క్షేత్రాలలో లింగరూపంలో ఉద్భవించి కొలువై ఉన్నాడు.ఈ జ్యోతిర్లింగాలను దర్శించ లేకపోయినా వాటిని స్మరించినా, చదివినా శివానుగ్రహంతో ముక్తి పొందుతారని శివమహాపురాణం స్పష్టం చేస్తోంది.”సౌరాష్ట్రే సోమనాథం చ…..ఘుశ్మేశం చ విశాలకే” అనే శ్లోకం ప్రకారం ఈ పన్నెండు జ్యోతిర్లింగాల పేర్లను ప్రాతఃకాలంలోను, సాయంసమయంలోనూ పఠిస్తే ఏడు జన్మల పాపాలు పటాపంచలౌతాయి. అంతటి మాహాత్మ్యం కలిగిన జ్యోతిర్లింగాల పేర్లు స్మరిస్తేనే అంతటి ఫలితం ఉంటే, వాటి ఆవిర్భావం, మాహాత్మ్యం గురించి చదివితే వచ్చే ఫలితం ఎంతటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
భక్తులకు అటువంటి చక్కని అవకాశం కల్పించడం కోసమే కవిరాజశేఖర, త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి సుపుత్రి చి|| కుమారి శ్రీ విద్య “ద్వాదశ జ్యోతిర్లింగాల మహాత్మ్యం” అను పేరిట ఒక చక్కని గ్రంథంగా అందించటం మనందరి మహద్భాగ్యం. ఈ గ్రంథంలో జ్యోతిర్లింగాల ఆవిర్భావ ఘట్టములు, క్షేత్రప్రశస్తి, పౌరాణిక గాధలు, మహిమలు సవివరముగా, సహేతుకంగా, సమగ్రంగా ఫలశ్రుతులతో పాటుగా ఏ జ్యోతిర్లింగాన్ని ఏ సమయంలో ఏ రీతిన అర్చించాలి, ఏ ఏ మాసాలలో, ఏ ఏ తిథులలో అర్చిస్తే సత్ఫలితాలు లభిస్తాయి వంటి అనేక విషయాలు రమణీయంగా ఆవిష్కరింపబడ్డాయి. ఈ పుస్తకం ఇంట ఉండటం అంటే జ్యోతిర్లింగాలు ఆ ఇంట ఉండటమే !