Description
దృతరాష్ట్రుడు ” నిద్ర పట్టటం లేదు ఎమైనా మంచి వాక్యాలు చెప్పు” అడిగిన దానికి విదురుడు ఇచ్చిన బదులు విదురనీతిగా ప్రసిద్ధి పొందింది.
మనిషి తనను లోకులు నిందించే పని చేయక , లోక హితమైన కార్యాలు చేయాలి.
పరుల సందకు ఈర్ష్యపడక నలుగురితో కలిసి మెలిసి బ్రతకాలి.
కోపం, పొగడ్తలకు పొంగి పోవడం , గర్వించడం, ఎంత ఉన్న అసంతృప్తి, దురభిమానం, ఏపనీ చేయక పోవడం దుర్జనుల లక్షణం…
తనను పాలించే రాజును , లోకాన్నిరక్షించే భగవంతుని, కట్టుకున్న భార్యను, బంధువులను సముచితంగా ఆదరించక పోతే ఏ కార్యం సత్ఫలితాన్ని ఇవ్వదు.
అవివేకులు తమను ప్రేమించే వారిని వదిలి ద్వేషించే వారి వెంట పడతారు. ఎదుటి వాడు బలవంతుడని తెలిసినా వారిని హింసిస్తాడు.
ధనము, విద్య,వంశము మంచి వారికి గౌరవాన్ని అణుకుకువను కలిగిస్తే చెడ్డవారికి మదాన్ని గర్వాన్ని కలిగిస్తుంది.
ఒకని బాణం శత్రువును నిర్జించ వచ్చూ లేక తప్పి పోవచ్చు కాని ఒకని నీతి శత్రువును నాశనం చేస్తుంది.
తాను ఒక్కడే తినడమూ, అందరూ నిద్రిస్తున్నప్పుడు ఒక్కడే ఆలోచించడం , ఒంటరిగా ప్రయాణం చేయడమూ మంచిది కాదు.
లోకంలో సత్యానికి మించిన మంచి గుణం లేదు…
క్షమాగుణాన్ని చేతగాని గుణంగా భావిస్తారు కాని దానికి మించిన ధర్మం లేదు.
పరుషవాక్యములు మాట్లాడక పోవడం, పాపపు పనులు చేయక పోవడం వలన మనిషి ఉత్తముడు అవుతాడు
Vidura Niti Telugu | Vidura Neeti Telugu | Vidura Neethi Telugu