Description
ముండక ఉపనిషత్తు లేదా ముండకోపనిషత్తు అత్యంత ప్రాచీన ఉపనిషత్తులలో ఒకటి. ఈ ఉపనిషత్తు అధర్వణ వేదమునకు సంబంధించింది. “ముక్తిత” సూత్రాలననుసరించి ఇది 108 ఉపనిషత్తులలో 5 వ ది.
శౌనకుడు అనే జిజ్ఞాసువు అంగిరస మహర్షి వద్దకు వచ్చి “ఏది తెలుసుకుంటే సర్వమూ తెలుసుకున్నట్లవుతుంది?” అని అడిగిన ప్రశ్నకు అంగిరసుడు “పరావిద్య, అపరావిద్య అని రెండు రకాలు తెలుసుకోవలసినవి ఉన్నాయని బ్రహ్మవిదులు అంటారు. పరావిద్య అంటే పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానం. అపరావిద్య అంటే లౌకికమయిన ధర్మాధర్మాలకు సంబంధించినది. రెండవదానికంటే మొదటిది గొప్పది. దాన్ని తెలుసుకున్నవాడు సంసారచక్రం నుంచి విముక్తుడవుతాడు.” అంటూ ఈ ఉపనిషత్తును బోధించాడు.