Description
గీత పంచామృతం
సకల వేదాల సారభూతంగా, పంచమవేదంగా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైన వేదవ్యాస భగవానుడు అందించినది శ్రీమన్మహాభారతము. బహికాముష్మికాలకు ఉపకరించే ఎన్నో స్తోత్రాలు, గీతాలు, గాథలు ఇందులో ఉన్నాయి.
కొందరు సంప్రదాయవేత్తలు ఈ మహద్గ్రంథంలోని భీష్మపర్వము నుండి ‘శ్రీమద్భగవద్గీత’, శాంతిపర్వం నుండి ‘భీష్మస్తవ రాజమ్’, ‘అనుస్మృతి’, ఆనుశాసనిక పర్వం నుండి ‘విష్ణుసహస్ర నామ స్తోత్రమ్’ నిత్యపారాయణ చేసుకోవలసినవిగా తెలియజేశారు. ఈ నాలుగేకాక వేదవ్యాసకృతమైన శ్రీమద్భాగవతములో నిర్విశేష వరబ్రహ్మస్తుతిగా చెప్పుకోదగ్గ ‘శ్రీగజేంద్ర మోక్షణమ్’ అనేది కూడా జతగా కలిపి ఈ ఐదింటిని పంచామృతాలు’గా మనకు అందజేశారు. ఇవి పారాయణ జరిగేచోట సకలదేవతలు, తీర్ధాలు, మహర్షులు సన్నిహితులై ఉంటారనేది శాస్త్రవాక్యం. ఈ పంచామృతాలు పారాయణగా చేస్తే మహాఫలితాలను కలుగజేస్తాయి. విచారణ చేస్తే బ్రహ్మజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తాయి. -సామవేదం షణ్ముఖ శర్మ : ఋషిపీఠం ప్రచురణ