Kasi Majili Kathalu – 6 Books

కాశీ మజిలీ కథలు
 6 Books – 12 Parts
Pages : 2610

1,111.00

Share Now

Description

కాశీ మజిలీ కథలు
6 Books – 12 Parts
Pages : 2610



        కాశీ మజిలీ కథలు మధిర సుబ్బన్న దీక్షితకవి రచించిన కథల సంకలనం. దీనిని దీక్షితకవి 12 భాగములుగా వచనమున రచించెను.

    చదువుతున్నంత సేపూ ఏదో ఉత్కంఠ! కథలోని పాత్రలతోపాటు మనమూ ఎక్కడెక్కడికో  వెళ్లిపోతూ  ఉంటాం. మనకు తెలియకుండానే ఏ రాకుమారుడో లేదా రాకుమార్తో మనలో పరకాయ ప్రవేశం చేస్తారు. అక్కడి నుంచి మన విహారమంతా మధురమైన ఊహాజగత్తులోనే! అంతలోనే హఠాత్తుగా  ఏ బ్రహ్మరాక్షసుడో మన మీద పడొచ్చు. ఆ రాక్షసుడితో వీరోచితంగా పోరాడుతూ ఉండగా… ఏ మూల నుంచో మంద్రస్థాయిలో వీణానాదం లాంటి గానమేదో లీలగా వినిపించవచ్చు.  ఆ మధుర కంఠధ్వనిని అనుసరిస్తూ  వెళితే అపురూప లావణ్యవతి అయిన ఏ గంధర్వ  కన్యో కనిపించవచ్చు. ఆమె ఒక శృంగార భావాత్మకమైన చిరునవ్వు విసిరి మెల్లగా లేచి ఒక చెట్టు చాటుకు వెళ్లి నిలబడి మనవంక ఓరకంట చూస్తూ నిరీక్షించవచ్చు! … ఇలా… ఇలా… ఇంతలో మన
భుజం మీద ఎవరైనా చేయి వేసి లేపితే తప్ప వాస్తవ ప్రపంచంలోకి రాలేం. అదే కాశీ మజిలీ కథలలోని మంత్రశక్తి!
ఏ భాషా సాహిత్యంలోనైనా కథలకో ప్రత్యేక స్థానం ఉంది. పండిత పామరులిద్దరినీ సమానంగా ఆకర్షించగల శక్తి వాటి సొంతం. కల్పన వాటికి ఆయువుపట్టు! కాల్పనిక ప్రపంచంలో ఓ మధురానుభూతి ఉంటుంది. నిజ జీవితంలో అనుభవించలేని సుఖాలు, చూడలేని వింతలు, విచిత్రాలు కాల్పనికతలో పుష్కలంగా లభిస్తాయి. అవి మనల్ని ఊహాజగత్తులో విహరింపజేస్తాయి. నిరంతర శ్రమైక జీవనంలో మునిగిపోయిన వాళ్లకు ఆ ఊహా జగత్తే కాసేపు ఊరటనిస్తుంది. అందుచేతనే ‘కథలు’ మన ‘వ్యథ’లను మరిపింప జేస్తాయంటారు అనుభవజ్ఞులు. ఈ మాటలు అక్షరాలా సరిపోతాయి ‘కాశీ మజిలీ కథల’కు.

All Parts Play List: