Kasi Majili Kathalu – 12 Books – Madhira Subbanna Deekshitulu

కాశీ మజిలీ కథలు
12 Books – 12 Parts

మధిర సుబ్బన్న దీక్షితకవి
రచించిన అసల కథలు
Original Books

3,600.00

Share Now

Description

కాశీ మజిలీ కథలు
12 Books – 12 Parts

        కాశీ మజిలీ కథలు మధిర సుబ్బన్న దీక్షితకవి రచించిన కథల సంకలనం. దీనిని దీక్షితకవి 12 భాగములుగా  రచించెను.

కథల నేపథ్యం
మణిసిద్ధుడనే యతి, గోపకుమారునితో దక్షిణాత్య ప్రాంతం నుంచి హిందువులకు పరమ పవిత్ర స్థలమైన కాశీ చేరుకునేందుకు కాలినడకన ప్రయాణమవుతారు. ఆ దారిలో జరిగే కథతో పాటు కాశీయాత్రలో వేసుకునే ప్రతి మజిలీలోనూ కథలు చెప్పుకుంటూంటారు. ఆ గొలుసుకట్టు కథలన్నింటి సంకలనం ఈ కాశీమజిలీ కథలు. ఈ గ్రంథం తెలుగు వారిలో మంచి పేరొందింది.
 
ఇతివృత్తం
అవిభక్త ఘట్టభూమిగా, మోక్షభూమిగా పేరుపొందిన కాశీ పట్టణం వెళ్ళేందుకు మణిసిద్ధుడు అనే విద్యావంతుడైన బ్రాహ్మణ బ్రహ్మచారి సంకల్పించుకుంటాడు. వాహన సదుపాయాలు లేకపోవడం, నదులు, కొండల వల్ల మార్గం దుర్గమంగా ఉండడంతో ఎవరైనా తోడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. ఎందరినో అడిగినా వారు భయపడి రాలేదు. తుదకు శ్రీరంగపురం ఊరి శివార్లలో జీవించే పశువుల కాపరి, అనాథయైన కోటప్ప మాత్రం బయలుదేరాడు. ఆ గోపాలకుడు, మణిసిద్ధుడు కాశీకి మజిలీలు చేసుకుంటూ బయలుదేరడం ప్రధాన కథ కాగా ఆపైన ఎన్నెన్నో ఉపకథలు, గొలుసుకట్టు కథలు ఉంటాయి. మార్గమధ్యంలో తనకు వింత వింత కథలు చెప్పి అలసట పోగొట్టి ఆహ్లాదం కలిగిస్తే వస్తానని గోపాలుడు పెట్టిన షరతుకు ఫలితమే ఆ కథలు. కథలలో పతివ్రతల ప్రభావము, దుష్టస్త్రీల కుచ్చితచేష్టలు, సత్పురుష సాంగత్యము వలన కలుగు లాభములు, దుష్టుల సహవాసము కలుగు నష్టములు, దేశాటనము పండితసంపర్కములవలన కలుగు జ్ఞానము, రాజనీతి, వ్యవహార వివేకము, వదాన్యలక్షణము, లోభిప్రవృత్తి మున్నగు అనేక విశేషములు వర్ణించబడినవి. ఇవికాక కృష్ణదేవరాయలు, భోజరాజు, శంకరాచార్యులు, విక్రమార్కుడు, నారదుడు, ప్రహ్లాదుడు మొదలైన మహాపురుషుల చరిత్రలను విచిత్రముగా వ్రాయబడ్డాయి.
కాశీమజిలీ కథలు విస్తృతమైన ప్రజాదరణ, పాఠకాసక్తిని సాధించి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ కథలు పాఠకులను చదివింపజేయడమే కాక పలువురు గ్రంథకర్తలు స్పందించేలా చేశాయి.
 
కాశీమజిలీ కథలు సినిమా రంగంపై కూడా తమ ప్రభావం చూపాయి. ఈ కథలు తెలుగు జానపద చలన చిత్రాలను విపరీతంగా ప్రభావితం చేశాయి. కొన్ని చిత్రాలలో కథలకు కథలు యధాతథంగా స్వీకరించి ఉపయోగించుకున్నారు.
సాహిత్యరంగంలో పలువురు రచయితలు వీటిని అనుసరించి లేదా వీటి స్ఫూర్తితో రచనలు చేశారు. కొన్ని పేదరాశి పెద్దమ్మకథలు, చందమామ కథలు, మర్యాద రామన్న కథల్లో కాశీమజిలీ కథలలోని ఇతివృత్తాలు, శైలి, నాటకీయత, శిల్పం వంటివి అనుసరించినట్లు తెలుస్తుంది.