Description
169 తెలుగు వారి సాంప్రదాయాలు | TeluguVari Sampradayalu
హిందూ సంప్రదాయంలో భాగంగా తెలుగువారికి కూడా కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు, సంప్రదాయాలు, వేడుకలు, కళలు, క్రీడలు మొదలైనవి ఉన్నాయి. మనిషి జన్మించినది మొదలు అంత్యేష్టి వరకు ఇవి మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. వివాహంలో జరిగే వేడుకలు, బారసాల, అన్నప్రాసన, భోగిపళ్ళు, బొమ్మల కొలువు, ఓణీల వేడుక .. పూర్వపు క్రీడలైన దాగుడుమూతలు, వైకుంఠపాళి, ఓమన గుంటలు, తొక్కుడుబిళ్ళ, అవ్వా అప్పచ్చి, కుచ్చకుచ్చ పుల్లాలు, ఒంగుళ్ళు దూకుళ్ళు… వీటితో పాటు కాళ్ళకు పారాణి, ముత్తయిదువులకు బొట్టు, చిలక జోస్యం , సోది, అనేక ఉత్సవాలు, నృత్యాలు .. మంగళ హారతులు.. ఇలా ఎన్నో.. మరెన్నో ఈ పుస్తకంలో పొందుపర్చబడ్డాయి. – గాజుల సత్యనారాయణ