Purusha Suktam | Sri Suktam – Master EK BOOKS

పురుష సూక్తము
శ్రీ సూక్తం

300.00

Share Now

Description

పురుషుడనబడు పరదైవతము వేయి తలలు, వేయి కన్నులు, వేయి పాదములు గలవాడు. అతడే మన భూలోకమును అన్ని వైపుల నుండి (అన్ని రూపములలోను) ఆవరించి యున్నాడు. అంతియే గాక పదివ్రేళ్ల పొడవున సర్వలోకములను అధిగమించి యున్నాడు.

ఈ జగత్తున ఏ యే వస్తువు అన్నముచే (ఆహార పానీయములు, వాయువు, కిరణములు మున్నగు వానిని లోనికి స్వీకరించుటచే) పెరుగుచున్నట్లుండియు, దానిని అతిక్రమించి శాశ్వతముగా వర్తించుచున్నదో, అది అంతయు పురుషుడే. ఏ యే వస్తువును మనము జరిగిపోయిన అంశముగాను, జరుగబోవు అంశముగాను గుర్తించు చున్నామో అది అంతయు మనకు వర్తమాన కాలముగా వ్యక్తమగుచున్న పురుషుడే. కనుక. అతడు అమృతత్వమునకు (తఱుగకుండుట) అధిపతి.

“తస్మాద్విరాడజాయత” అంటే పురుషుడు నుంచి గ్రుడ్డు పుట్టింది అని అర్థము. ఈ గ్రుడ్డు నుంచి మళ్ళా పురుషుడు పుట్టాడు. “విరాజో అధి పూరుషః” – అంటే పురుషుడు నుంచి గ్రుడ్డు పుట్టింది. గ్రుడ్డు నుంచి పురుషుడు పుట్టాడు. అంటే పుంజు వలన కోడి గ్రుడ్డు వచ్చింది. గ్రుడ్డువలన మళ్ళీ పుంజు వచ్చింది. మొదటి వాడిని తండ్రి అంటారు.. తరువాత వాడిని కొడుకు అంటారు. మధ్యన గ్రుడ్డు అడ్డముంది, దాన్నే తల్లి అంటారు. మొదటివాడు తండ్రి, తరువాత వాడు కొడుకు, మళ్ళీ రేపు వీడు తండ్రిన్నీ, ఆ పుట్టినటువంటి వాడు కొడుకున్నూ అవుతారు. ఇది గుర్తుపెట్టుకుంటే పురుష సూక్తము అంతా అర్థమవుతుంది, బ్రహ్మాండమంతా అర్థమవుతుంది.