Pujalu Endhuku Chayyali

పూజలు ఎందుకు చేయాలి

36.00

మరిన్ని Telugu Books కై
Share Now

Description

పూజలు ఎందుకు చేయాలి

వ్రతాలు అవసరమా?
భగవంతునికి అనేక రూపాలున్నాయి. ‘యాదృశీ భావనా యస్య సిద్ధిర్భవతి తాదృశీ’ అన్న ఆర్యోక్తిని, భక్తుల భావనను అనుసరించి ఆ పరమాత్మ హరిగా, హరునిగా, జగదంబగా, ఇతర దేవతామూర్తులుగా దర్శనమిస్తుంటాడు. ఎవరి ఇష్టాన్ని బట్టి వారు ఆయా దేవతలను ఆరాధిస్తారు. నిత్య పూజ, నిత్య వ్రతాలు, నైమిత్తిక వ్రతాలు, నోములు, జపం, ధ్యానం, యజ్ఞయాగాదులు, తపస్సు ఇలా.. దేవతారాధన పలువిధాలు.
ఈ ఆరాధనా ప్రక్రియలన్నింటికీవిధివిధానాలను సూచించే గ్రంథాలు వేదసంహితలు, ఉపనిషత్తులు, పురాణాలు, ధర్మశాస్త్రాలు, ఆగమాలు, కల్ప గ్రంథాలు. వీటిలో వ్రతాల విషయంలో ఆధునిక కాలంలో కొంత ఆదరణ తక్కువగా కనబడుతోంది. కానీ వ్రతాలవల్ల వ్యక్తికీ, సమాజానికి ఎంతో శ్రేయస్సు కలుగుతుంది. ఏ వ్రతాన్ని పరిశీలించినా అందులో సమాజానికి మేలు చేసే ఎన్నో అంశాలు అంతర్గతంగా ఇమిడి ఉన్నాయి. వ్రతాలు కొన్ని కేవలం పురుషులు మాత్రమే ఆచరించవలసినవి. కొన్ని స్త్రీలు మాత్రమే ఆచరించవలసినవి. కొన్ని స్త్రీ పురుషులు అందరూ వేరు వేరుగానూ, దంపతులుగానూ కూడా ఆచరించదగినవి.
ఈ వ్రతాలు స్థూలంగా కనుక చూసినట్లయితే వ్యక్తుల ఆహార, విహార, వ్యవహారాలలో క్రమబద్ధమైన దినచర్యను తీసుకుని వచ్చేవే. పాటించేవారికి 365 రోజులూ వ్రతాలు ఉన్నాయి. ప్రతివ్రతంలోను తొలినియమం ప్రాతఃకాలంలో అంటే సూర్యోదయానికి ముందే మేలుకోవడం, స్నానం చేయడం. దీనివల్ల సోమరితనం తగ్గుతుంది. ఉత్సాహం పెరుగుతుంది. బుద్ధి వికాసం కలుగుతుంది. శరీర మాలిన్యాలు తొలుగుతాయి. బలం చేకూరుతుంది. వర్చస్సు పెరుగుతుంది. మనం చేయవలసిన పనులలో లాఘవం పెరుగుతుంది. అలాగే పూజా గృహాన్ని అలంకరించటం వల్ల వ్యక్తులలోని కళాత్మక దృష్టి పెరుగుతుంది. పూజావిధానలవల్ల మాట్లాడే తీరులో సంస్కారం పెరుగుతుంది.
మంత్రాలను ఉచ్చరించే తీరువల్ల శరీరంలో అంతర్గతంగా 72 వేల నాడులు జాగృతమౌతాయి. మన ఇంటికి వచ్చే అతిథులను కూడా దైవంగా చూసే సంస్కారం అలవడుతుంది. వివిధ వ్రతాలలో అంతర్భాగంగా ఉపవాసం ఉండటం, మితాహార స్వీకారం, నైవేద్యాలలో ఎంపికచేసిన పదార్థాలను మాత్రమే వండటం వంటివి ఉన్నాయి. ఈ మితాహార, ఉపవాసాదుల వల్ల శరీరంలో మేదస్సు (కొవ్వు) పేరుకోవటం తగ్గుతుంది. మనుషులు నాజూకుగా కనబడతారు. ఈ వ్రతాలను ఆచరించే వారిని కనుక పరిశీలిస్తే వారు ఎక్కువ పనిసామర్థ్యం కలిగి, ఎంతో శరీరబలంతో వ్యవహరించడం కనబడుతుంది. వ్రత నమస్కారవిధానంలో శారీరక వ్యాయామం ఉంది. శౌచం ఉంది. మానసిక, ఆధ్యాత్మిక వికాసం ఉంది. అలాగే పురుషులు వ్రతనియమాలను పాటించటం వల్ల దురలవాట్లకు దూరం కాగలుగుతారు. నిత్యం వ్రతాలను ఆచరించటం వల్ల ఆరోగ్యంగా దీర్ఘాయుర్దాయంతో జీవించవచ్చు. అందుకే మన భారతీయ వ్రతసంస్కృతిని పునరుద్ధరించుకోవలసిన తరుణం ఆసన్నమైంది.   – ఆచార్య రాణి సదాశివ మూర్తి,