Pancharamas – Dwadasa Jyotirlingas

63.00

పంచారామాలు – ద్వాదశ జ్యోతిర్లింగాలు

అష్టాద‌శ శ‌క్తి పీఠాలు


మరిన్ని పుస్తకాలకై

Category:


Share Now

పంచారామాలు – ద్వాదశ జ్యోతిర్లింగాలు

అష్టాద‌శ శ‌క్తి పీఠాలు

కోర్కెలు తీర్చడం నుంచి మోక్షం ఇచ్చే దాకా..

   ‘సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం..’ అని మనం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చదువుతుంటాం. సోమనాథ్‌లో సోమనాథుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మహాకాలేశ్వరుడు, ఓంకారేశ్వరంలో అమలేశ్వరుడు, పర్లిలో వైద్యనాథుడు, పుణెలో భీమశంకరుడు, రామేశ్వరంలో రామలింగేశ్వరుడు, ఔండా(గుజరాత్‌)లో నాగేశ్వరుడు, వారణాసిలో విశ్వనాథుడు, నాసిక్‌లో త్య్రంబకేశ్వరుడు, కేదారనాథ్‌లో కేదారేశ్వరుడు, వెరుల్‌ (మహారాష్ట్ర)లో ఘృష్ణుశ్వరుడు.. ఈ పన్నెండూ జ్యోతిర్లింగాలు. అయితే, జ్యోతిర్లింగాలని వాటిని పిలిచినప్పుడు ఆ పన్నెండు చోట్లా జ్యోతి ఉండాలి. కానీ, ఆయా క్షేత్రాల్లో శివలింగమే కనపడుతుంది కానీ జ్యోతి కనపడదు. మరి వాటిని అలా ఎందుకు పిలుస్తారు? దీనికి సమాధానం రుద్రంలోని ప్రార్థనాగద్యంలో చెప్పారు.
ఆపాతాళనభఃస్థలాన్తభువన బ్రహ్మాండ మావిస్ఫురత్‌
జ్యోతిస్ఫాటికలింగ మౌళివిలసత్పూర్ణేందు వాన్తామృతై
అస్తోకాప్లుతమేకమీశ మనిశం రుద్రానువాకాన్‌ జపన్‌
ధ్యాయేదీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే చ్ఛివమ్‌
ఏ లింగం దగ్గరకు వెళ్లి మనం అడిగినప్పుడు ఇహమునందు కావాల్సిన సౌఖ్యం నుంచి మోక్షం వరకూ ఏదైనా ఇవ్వగలిగిన పరబ్రహ్మస్వరూపాలే జ్యోతిర్లింగాలు. ఈ లోకంలో జ్ఞానం పొందాలన్నా, కోరికలు తీరాలన్నా శివుణ్ని అర్చించాలి. అందుకే ఎవరైనా కష్టాల్లో ఉన్నట్లయితే నలభై ఒక్క రోజులు దక్షారామం వెళ్లి భీమేశ్వర దర్శనం చేసుకోమంటారు. దక్షారామం భోగక్షేత్రం. అది మనిషికి ఎలాంటి భోగాలనైనా ఇచ్చేస్తుంది. ఎలాంటి కోరికనైనా తీర్చేస్తుంది. జ్యోతిర్లింగాన్ని ఒకసారి చూసి ఇంటివద్ద కూర్చుని తిరిగి దానిని స్మరించినట్లయితే కోరిక తప్పక తీరుతుంది. ఆ మేరకు వేదం అభయం ఇచ్చింది. కాబట్టి కోర్కెతీర్చడం నుంచి మోక్షం ఇవ్వడం వరకూ చేయగలిగిన శివలింగాలు ఏవి ఉన్నాయో అవే జ్యోతిర్లింగాలు. అవి ‘స్వయంభు’.. ఒకరు ప్రతిష్ఠ చేసినవి కావు. ఈశ్వరుడు చిత్రవిచిత్రమైన పరిస్థితుల్లో అలా వచ్చాడు. అలా ఎందుకు వచ్చాడు అని తెలుసుకోవడానికి మనం ఆయా క్షేత్రాల స్థలపురాణాలను పరిశీలించాలి. వినాలి. గుడిలో దర్శనం చేసుకునేటప్పుడు వినే స్థలపురాణాన్ని.. జ్యోతిర్లింగ ఆవిర్భావ చరిత్ర పురాణాంతర్గతంగా వింటే, ద్విగుణీకృత ఫలితం కలుగుతుంది. గుడిలోకి వెళ్లి దర్శనం చేసి ధ్యానం చేసిన ఫలితం ఎంతటిదో అంత ఫలితాన్ని ఇస్తుంది. అందుకే వీటిని పురాణాల్లోకి తీసుకువస్తారు. ఆయా కథలను తెలుసుకుని స్మరించడం చేత.. స్వయంభువు అయిన ఈశ్వరుడు ప్రసన్నుడై ఎన్నో శుభ ఫలితాలను ఇస్తాడు.
– చాగంటి కోటేశ్వరరావు శర్మ

———————-

   శాంకరి – శ్రీలంక – ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలోఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో ‘త్రికోణేశహవర స్వామి’ అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.
     కామాక్షి – కాంచీపురం, తమిళనాడు – మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
శృంఖల – ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ – ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.
చాముండి – క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక – అమ్మవారు చాముండేశ్వరీ దేవి.
జోగులాంబ – ఆలంపూర్, తెలంగాణ – కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో ‘తుంగభద్ర’ & Krishna నదులు కలిసే స్థలంలో ఉంది.
భ్రమరాంబిక – శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ – కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లికార్జునస్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.
మహాలక్ష్మి – కొల్హాపూర్, మహారాష్ట్ర – ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.
ఏకవీరిక – మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర – ఇక్కడి అమ్మవారిని ‘రేణుకా మాత’గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.
మహాకాళి – ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ – ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.
పురుహూతిక – పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ – కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.
గిరిజ – ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒడిషా – వైతరిణీ నది తీరాన ఉంది.
మాణిక్యాంబ – దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ – కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.
కామరూప – హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం – బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.
మాధవేశ్వరి – ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో – ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.
వైష్ణవి – జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ – ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.
మంగళ గౌరి – గయ, బీహారు – పాట్నా నుండి 74 కిలోమీటర్లు.
విశాలాక్షి – వారాణసి, ఉత్తర ప్రదేశ్.
సరస్వతి – జమ్ము, కాష్మీరు – అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు.