Ksheerabdhi Dwadashi Vratam

క్షీరాబ్ధి వ్రతం

12.00

SKU: 123060 మరిన్ని Telugu Books కై
Share Now

Description

క్షీరాబ్ధి వ్రతం 
క్షీరాబ్ది ద్వాదశి – క్షీరసాగరమథనంలోని ఆంతర్యం!

కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలలో క్షీరాబ్ది ద్వాదశి ఒకటి. దేవదానవులు ఈ రోజునే సాగరాన్ని మథించడం మొదలుపెట్టారు కాబట్టి ఈ రోజుని చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. ఇంతే కాకుండా యోగీశ్వర ద్వాదశి అనీ, మథన ద్వాదశి అని వివిధ పేర్లు కూడా ఉన్నాయి. కార్తీక శుద్ధ ఏకాదశినాడు, క్షీరసముద్రం మీద శయనించిన విష్ణుమూర్తి నిదురలేచి, బ్రహ్మాదిదేవతల సమేతంగా బృందావనం (తులసివనం)లోకి ప్రవేశిస్తారట. అందుకని ఈ రోజున ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో వారికి సకల శుభాలూ కలుగుతాయంటారు. ఇక కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి ఉన్న ప్రాధాన్యత కూడా సామాన్యం కాదు. ఉసిరి చెట్టు నీడ పడిన నీటిలో స్నానం చేసినా, సాయంవేళ ఉసిరి చెట్టు కింద దీపాన్ని ఉంచినా విశేషఫలితం దక్కుతుందని పెద్దల మాట.

క్షీరాబ్ది ద్వాదశినాడు తులసికోటలో విష్ణుమూర్తి రూపాన్నీ, ఉసిరికాయతో కూడిన ఉసిరి కొమ్మనీ ఉంచి ఓం శ్రీ తులసీ ధాత్రి సహిత లక్ష్మీనారాయణస్వామినే నమః అన్న మంత్రాన్ని జోడిస్తూ దీపారాధన, సంకల్పం, కలశపూజ, షోడశోపచార పూజ వంటి పూజావిధినంతటినీ చేసి ధూపదీపనైవేద్యాలను సమర్పించి విష్ణుమూర్తిని కొలుచుకుంటారు భక్తులు. ఈ రోజున దీపాన్ని వెలిగించినవారికి ఏడాది పొడవునా దీపాన్ని వెలిగించిన ఫలితం దక్కుతుందని చెబతారు. ఇక ఈ రోజు దీపదానం చేసిన వారికి జన్మజన్మాల పాపాలన్నీ దహించుకుపోతాయని కార్తీక పురాణం చెబుతోంది. హైందవులు తులసికీ, ఉసిరికీ ఎందుకంత ప్రాముఖ్యతని ఇచ్చారో చెప్పేందుకు ఆధ్మాత్మికమైన, ఆరోగ్యపరమైన కారణాలు అనేకం కనిపిస్తాయి. ఇక క్షీరసాగరమథనాన్ని పరిశీలిస్తే ఆధ్మాత్మిక రహస్యాలు అనేకం గోచరిస్తాయి.
అమృతం కోసం దేవదానవులిద్దరూ క్షీరసాగరాన్ని మథించిన ఘట్టం రామాయణ,భారతాల్లోనే కాకుండా పురాణాల్లో కూడా ప్రస్తావనకు వస్తుంది. అలా సాగరమథనం ద్వారా వచ్చిన అమృతాన్ని పంచుకోవలన్నది దేవదానవుల నియమం. అందుకోసం నాగరాజైన వాసుకిని తాడుగానూ, మందర పర్వతాన్ని కవ్వంగానూ ఉపయోగించాలనుకున్నారు దేవదానవులు. ఈనాటి బిహార్‌లోని భగల్‌పూర్‌ హైవేకి దగ్గరలో ఉన్న ఎత్తైన గ్రానైటు కొండే పురాణాల్లో పేర్కొన్న మందర పర్వతమని కొందరి నమ్మకం. దానికి తగినట్లుగానే ఆ కొండ శిఖరం కవ్వం ఆకారంలో ఉంటుంది. ఇక సాగరమథనం కోసం మందర పర్వతానికి దన్నుగా కూర్మావతారం(తాబేలు) వెలసింది. తాబేలుది ఒక చిత్రమైన ప్రవృత్తి. తనకి ఏదైనా హాని జరుగుతుందని తెలిసినప్పుడు, లోపలికి ముడుచుకుపోతుంది. బాహ్య ప్రవృత్తిగా ఉన్న ఇంద్రియాలన్నింటినీ విరమించుకోగలగడం ధ్యానికి ఉండే ఉన్నతమైన లక్షణం అని యోగం చెబుతోంది. సర్పమేమో (వాసుకి) కుండలినిని సూచిస్తుంది. మనిషిలో ఉండే మంచి చెడులే దేవదానవులు! మనిషి అంతర్మఖుడై, తనలో నిద్రాణంగా ఉన్న ఆధ్మాత్మిక శక్తులను మేల్కొల్పడానికి నిత్యం చేసే ప్రయత్నమే సాగరమథనం.
మనిషి తన అంతర్మథనాన్ని మొదలుపెట్టగానే లభించేది సత్యమనే గరళమే! దాన్ని అంగీకరించిన తరువాత అధికారం (ఐరావతం), సంపద (లక్ష్మీదేవి), ఆరోగ్యం (ధన్వంతరి), కీర్తి (చంద్రుడు)… అన్నీ లభిస్తాయి. వాటితో ఆగిపోకుండా, అన్నింటినీ దాటుకుని వెళ్లిననాడు అమృతం దక్కుతుంది. ఇంత చేసినా చివరికి ప్రబలమైన బలహీనతలకు లొంగిపోతే… మోహినిని చూసి అమృతాన్ని జారవిడుచుకున్న దానవులలాగానే మనిషి కూడా దిగజారిపోతాడు. లేకపోతే మోక్షమనే అమృతాన్ని సాధిస్తాడు.
” కార్తీక శుద్ధ ద్వాదశి ” ని క్షీరాబ్ది ద్వాదశి అందురు. దీనినే చిలుక ద్వాదశి అని కూడా అంటారు. ఈ రోజున శ్రీ మహా లక్ష్మికి శ్రీ మన్నారాయుణునికి వివాహము చేసెదరు.
వ్రత పూజా విధానము : ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి ,అలికి , బియ్యపు పిండితో గాని ,రంగుల చూర్ణములతో గాని ముగ్గులు పెట్టి ,దైవ స్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి .పీట మరీ ఎత్తుగా గాని ,మరీ పల్లముగా గాని ఉండకూడదు. పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి ,కుంకుమతో బొట్టు పెట్టి ,వరిపిండి (బియ్యపు పిండి ) తో ముగ్గు వేయాలి .సాదారణంగా అష్ట దళ పద్మాన్నే వేస్తారు. ఈ రోజున (క్షీరాబ్ది ద్వాదశి ) పద్మమును, శంఖమును, చక్ర ,పాదములు కూడా అలంకరించవలెను . పూజ చేసే వారు తూర్పు ముఖంగా కూర్చోవాలి .ఏ దైవాన్ని పూజించ బోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమను గాని ,చిత్ర పటమును గాని ఆ పీటపై ఉంచాలి .ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి ) దానికి కుంకుమ బొట్టు పెట్టి పిదప ఒక పళ్ళెంలో గాని ,కొత్త తుండు గుడ్డ మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమల పాకు నుంచి ,అందు పసుపు గణపతినుంచి అగరువత్తులు వెలిగించాలి .ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి .దీపారాధన నైరుతి దిశలో చేయవలెను.
పూజకు కావలసిన వస్తువులు – దీపారాధన విధానము : దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద ) వెండిది గాని ,ఇత్తడిది గాని ,మట్టిది గాని వాడవచ్చును. కుందిలో 3 అడ్డ వత్తులు 1 కుంభ వత్తి (మధ్యలో )వేసి నూనెతో తడపవలెను . ఇంకొక అడ్డవత్తి నూనెతో తడిపి ఏక హారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువు ) వేసి ముందుగా ఏకహారతి లో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి ,వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డవత్తి 1 కుంభ వత్తి వెలిగించవలెను. తరువాత చేయి కడుక్కుని నూనె కుంది నిండా వేసి పిదప ఆ కుందికి మూడు చోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాదనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను. కుందిలో మిగిలిన రెండు అడ్డ వత్తులు పూజా సమయములో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను .దీపారాధనకు నువ్వుల నూనె గాని ,కొబ్బరి నూనె గాని ,ఆవు నెయ్యి గాని వాడవచ్చును. ఈ విధంగా దీపం వెలిగించి గంటను వాయిస్తూ నమస్కరించి ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను .

Additional information

Weight 1 kg
Dimensions 11 × 11 × 11 cm
color

Black, Blue, Grey, Red, Violet