kavya prakasam in telugu

కావ్యప్రకాశం

– మమ్మటుడు,

300.00

+ Rs.70/- For Handling and Shipping Charges
Share Now

Description

మమ్మటుడు సంస్కృతంలో వ్రాసిన కావ్యప్రకాశః అనే లక్షణ గ్రంథం ధ్వనిప్రస్థానానికి సంబంధించినది. అది నేటికీ పరమ ప్రామాణికమైన గ్రంథం. అది సాహిత్యాధ్యేతలందరికీ అవసరమైనది

కావ్యానికి ప్రయోజనం ఏమిటీ. కేవలం ఆనందం కలిగించడమేనా? ఉపదేశం కూడా కావ్య ప్రయోజనమా అన్నది చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రాచీన అలంకారికులు కావ్యానికి అనేక ప్రయోజనాలు తెలిపారు.

భామహుడు

ధర్మార్థ కామ మోక్షేషు వైచక్షణ్యం కళాసుచ
ప్రీతిం కరోతి కీర్తిం చ సాధు కావ్య నిషేవణం

ధర్మార్థ కామ మోక్షాలలోను, కళలలో నైపుణ్యాన్ని, కీర్తిని, ప్రీతిని సత్కావ్యం కలిగిస్తుందని భామహుని అభిప్రాయము. ఇదే కావ్య ప్రయోజనం

మమ్మటుడు

మమ్మటుడు తన కావ్య ప్రకాశంలో కావ్య ప్రయోజనాలుగా ఈ క్రింది వానిని వివరించాడు.

కావ్యం యశసే అర్థకృతే వ్యవహారవిదే శివేతర క్షతయే
సద్యః పర నిర్వృతయే కాంతాసమ్మితయోపదేస యుజే.

కావ్యం యశస్సు కొరకు, ధనసంపాదన కొరకు, వ్యవహార ఙ్ఞానం కొరకు, అమంగళ పరిహరణం కొరకు, మోక్ష సాధనకొరకు, కాంతా సమ్మితమైన ప్రభోధం కొరకు అని మమ్మటుని అభిప్రాయము.