1 KalaBhairava Raksha kavacham

కాలభైరవ రక్షాకవచమ్

108.00

Share Now

Description

 

KalaBhairava Rakshakavacham book

కాలభైరవ రక్షాకవచమ్

ప్రపంచంలో భక్తులకు నాణాలను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక కాలభైరవ క్షేత్రం గోదావరి నదీ తీరం, కాలభైరవ దీక్షా ఘాట్, రాజమండ్రి….
హారతి, అభిషేక దర్శనంతో గ్రహబాధలను, ఋణ బాధలను, శత్రుబాధలను, రోగబాధలను పోగొట్టి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించే శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామివారి, శ్రీవారాహి, శ్రీ రాజశ్యామలా మాతల దర్శనం నెలలో 8 రోజులు మాత్రమే ఉంటుంది. ప్రతీ ఆదివారం,అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉంటుంది . సాయంత్రం దర్శనం ఉండదు. స్వామి వారి దర్శనానికి ఏ విధమైన పూజా సామాగ్రిలు తీసుకురావాల్సిన అవసరం లేదు.
1. మహాకాల్ త్రిషుల్ హారతి.
రాజమండ్రి అఖండ గోదావరినది తీరాన కాలభైరవగురు సంస్థాన్ మఠంలో క్రింద ఉన్న మూలవిరాట్ కాలభైరవ స్వామి వారికి “మహాకాల్ త్రిషుల్ హారతి సేవ”
ఉ.7గం.లకు ఒకసారి మాత్రమే ఉంటుంది.
అందరూ పాల్గొనవచ్చు.
ఉచిత సేవ
2.సర్పహారతి సమర్పణ సేవ
పైన మొదటి అంతస్తులో 9అడుగుల నవగ్రహ శివలింగం పై కొలువు తీరిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి “గోఘృత స్వయం సర్పహారతి సమర్పణసేవ” ఉ.7.30 నుండి మ.11.45 వరకు మాత్రమే ఉంటుంది.
అందరూ పాల్గొనవచ్చు.
ఉచిత సేవ
3. ధన ప్రసాద సేవ
ప్రపంచంలో భక్తులకు “నాణాలను ప్రసాదంగా” ఇచ్చే ఏకైక స్వామి వారు శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారు. (స్వామి ప్రసాదంగా రెండు నాణాలను ఇస్తారు) ఉచిత సేవ
4.స్వయం అభిషేకం సేవ
క్రింద ఉన్న క్షేత్రపాలక కాలభైరవ స్వామి వారికి “జలంతో స్వయం అభిషేకం సేవ” అందరూ పాల్గొనవచ్చు ఉచిత సేవ
5. ఉచిత దర్శనం సేవ
క్రింద ఉన్న కాలభైరవస్వామి వారిని, శ్రీలక్ష్మీ గణపతి స్వామి వారిని, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని మరియు పైన ఉన్న శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణభైరవ స్వామి వారిని, శ్రీ వారాహి మాతను, శ్రీ రాజశ్యామలా మాతను, స్వర్ణ గణపతి స్వామి వారిని, బ్రహ్మసూత్ర మహా శివలింగమును, దర్శించవచ్చు..
6.అన్నప్రసాద సేవ
స్వామి వారిని దర్శించే భక్తులకు “అన్నప్రసాద వితరణ సేవ” జరుగుతుంది.
ఈ కాలభైరవ అన్నప్రసాద సేవలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు.
కాలభైరవ అన్నప్రసాద సేవ
7.ఉచిత మంత్రోపదేశసేవ
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 102 మంత్రోపదేశములు సంపూర్ణం చేసి 16 వేలకు పైగా భక్తులకు అనగా భక్తి శ్రద్ధ మన భారతీయ సనాతన ధర్మంపై విశేషమైన నమ్మకం ఉన్నటువంటి స్త్రీలకు పురుషులకు పిల్లలకు మంత్రపదేశం చేయడం జరిగింది.
ఈ మంత్రోప్రదేశంలో పాల్గొనడానికి కేవలం భక్తి శ్రద్ధ మంత్రం పైన నమ్మకం ఉంటేచాలు, “మంత్ర ఉదేశంలో పాల్గొనవచ్చు”.
దీనికి ఏ విధమైనటువంటి ధనము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ఒక ధర్మ సేవగా చేస్తున్నారు మన గురువుగారు.
కొన్నిపౌర్ణమి మరియు ప్రత్యేక పర్వదినాల్లో ఈ మంత్రోప్రదేశం ఉంటుంది. మంత్రోపదేశం అంటే ఏమిటి? మరలా ఎప్పుడు ఉంటుంది?, ఎలా పాల్గొనాలి? నియమాలు ఏమిటి? అనే విషయాల కోసం కాలభైరవ టీవీ, కాలభైరవగురు యూట్యూబ్ ఛానల్ ద్వారా మన గురువుగారు తెలియజేస్తారు..
8. 108 కాలభైరవ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ సేవ మీరు ఎక్కడైనా కాలభైరవ విగ్రహ ప్రతిష్ట చేయాలనుకుంటే
“ఉచితంగా కాలభైరవ విగ్రహము” యంత్రరాజము, నవపాషాణం,పంచలోహాలు నవరత్నాలు పంపిణీ సేవ.
9.ఉచిత మంత్రసాధన శిక్షణ
దుఃఖ రహిత సమాజం కోసం, భారతీయ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా మంత్రశాస్త్రం పట్ల, మన భారతీయ మహర్షులు రచించిన మహా గ్రంథాలలో నిక్షిప్తమైన దైవిక ధర్మాలను, “మానవ ధర్మాలను, ఆరోగ్య ధర్మాలను, సుఖమయ జీవన శక్తిరహస్యాలను అందరికీ తెలియజేస్తూ, అవగాహన కల్పించి”, ఎవరిని వారు అభివృద్ధి పరచుకుని, సమాజాన్ని వృద్ధిపరిచి జన్మను సార్ధకత చేసుకునేలా వారికి మార్గాన్ని చూపించడం కోసం, శక్తి వంతమైన వ్యక్తులుగా మార్చడం కోసం – దుఃఖ రహిత సమాజం నిర్మించడం కోసం చేస్తున్న బృహత్తర కార్యం
10.కాలభైరవ తత్వప్రచార సేవ.
జీవితాంతం ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలతో, ఆడంబరంగా జీవించడానికి కావలసిన శక్తిని ప్రసాదించే విధాత, క్షేత్రపాలకుడు దిగంబరుడు కాశీకోత్వాల్ కాలభైరవ స్వామి వారి యొక్క “దిగంబర తత్వాన్ని అనగా యదార్ధాన్ని జీవితము యొక్క పరమార్ధాన్ని” గ్రామ గ్రామాన ప్రచారం చేయడం ధర్మస్థాపన మరియు ధర్మాన్ని వృద్ధిగావిస్తూ ఈ మానవ జన్మలను ఉద్ధరించుకునే మహోద్యమం..
మరిన్ని వివరాలకు https://www.facebook.com/kalabhairavaTV

రాజమండ్రి కాలభైరవగురు సంస్థాన్ మఠం కాలభైరవ టెంపుల్ లో నిర్వహించు ప్రత్యేక పూజ, జప, హోమ కార్యక్రమాలు..
1.ఆషాడ గుప్త నవరాత్రులు.
అనగా వారాహి గుప్త నవరాత్రులు. ఆషాడ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాడ శుద్ధ నవమి వరకు శ్రీవారాహి మాతకు ప్రత్యేక పూజ, జపం, హోమం, ఉపదేశము మరియు ఆఖరి రోజున పూర్ణాహుతి మహోత్సవం పూజ్య శ్రీకాలభైరవగురు స్వామి వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు.
ఈ 9రోజుల వారాహి దీక్ష, పూజ, జప, హోమ, అభిషేక వివరాలకు Kalabhairava TV యూట్యూబ్ చానెల్ చూడగలరు.
మరిన్ని వివరాలకు వారాహి హోమమ్ గ్రంధం చూడండి.
2.గురు పూర్ణిమ ఉత్సవం.
అషాడశుద్ధ పూర్ణిమ రోజున గురుపరంపర పాదుకార్చన గురుహోమం జరుగును.
3.అక్టోబర్02 గురువు గారి జన్మదిన మహోత్సవం
సందర్భంగా కొంతమంది వృద్ధులకు, వికలాంగులకు నిత్యవసర వస్తువులు పంపిణీ సేవ జరుగును
4.మాఘ గుప్త నవరాత్రులు.
వీటినే శ్యామల గుప్త నవరాత్రులు అంటారు. మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు అమ్మవారిని తొమ్మిది రోజులు 9 శక్తి స్వరూపాలుగా భావించి మూలమంత్రాలతో పూజ, జపం, హోమం, ఉపదేశము మరియు ఆఖరి రోజున పూర్ణాహుతి మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.
ఈ 9రోజుల రాజశ్యామలా దీక్ష, పూజ, జప, హోమ, అభిషేక వివరాలకు Kalabhairava TV యూట్యూబ్ చానెల్ చూడగలరు.
మరిన్ని వివరాలకు రాజశ్యామలా హోమమ్ అను పుస్తకం చూడండి.
5.మార్గశిర బహుళ అష్టమి
కాలభైరవ జయంతి మరియు కాలభైరవాష్టమి.
స్వామి వారి జయంతి సంద్భముగా ప్రత్యేక పూజ, దర్శనం, రుద్రాభిషేకం, మహాచండీ కాలభైరవ యాగం , మహా అన్నదాన సేవ, పిల్లలకు రుద్రాక్షల పంపిణీ జరుగును.
6. కాలభైరవ దీక్ష, కాలభైరవ ఇనుముడి సమర్పణ సేవ.
కాలభైరవ జయంతికి 41 రోజుల ముందు లేదా 21 రోజులకు ముందు లేదా 11 రోజుల ముందు కాలభైరవ దీక్షను గురువుగారు ఇస్తారు. ఎవరైనా సరే ఈ కాలభైరవ దీక్షను స్వీకరించాలనుకుంటే నీలం రంగు వస్త్రాలు ధరించి గురువుగారు చెప్పే నియమాలను కచ్చితంగా పారించి దీక్ష చేసి కాలభైరవ జయంతి రోజున ఇరుముడిని సమర్పించి, దీక్ష విరమణ చేయాలి.
మరిన్ని వివరాలకు KalabhairavaTV యూట్యూబ్ చానెల్ చూడగలరు.
లేదా 9000 200 117 WhatsApp నంబర్ కు మెసేజ్ చేసి వివరాలు పొందగలరు.