Sale!

Himalaya Rahasyalu in Telugu

Pilot Baba Experiences in Telugu
హిమాలయ రహస్యాలు

288.00

మరిన్ని Telugu Books కై
Share Now

Description

గురుడొంగ్గ్మార్ సరస్సు
 
తీస్తా నదికి మూలమైన ఈ ఎత్తైన సరస్సు కాంచెంగ్యావో పర్వతశ్రేణి పక్కన ఉన్న ఒక పీఠభూమిపై ఉంది. పురాణాల ప్రకారం ఈ ప్రాంతం ఒకప్పుడు బీటలు వారిన పొడి నేలగా ఉండేది. ఇక్కడి సరస్సు ఏడాది పొడవునా గడ్డకట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ సరస్సును చూస్తే శీతాకాలంలో కూడా గడ్డకట్టని ఒక ప్రదేశాన్ని కనుగొనవచ్చు. ప్రముఖ బౌద్ధ గురువు పద్మసంభవ ఆ ప్రత్యేకమైన ప్రదేశాన్ని తాకి దీని చుట్టు పక్కల ఉండే ప్రజల జీవనం సుఖమయంగా ఉండేందుకు ఆ ప్రాంతం ఎప్పుడూ గడ్డకట్టకుండా ఉండాలని దీవించినట్లు చెబుతారు. మీరు నమ్మినా నమ్మకపోయినా శీతాకాలం యొక్క అత్యంత కష్టతరమైన సమయంలో కూడా ఈ చిన్న ప్రాంతం మంచు పట్టకుండా కనిపిస్తుంది.
 
​రూప్ కుండ్ సరస్సు
 
ఉత్తరాఖండ్ అత్యంత అందమైన, ఆసక్తికరమైన ట్రెక్స్ ను కలిగి ఉంది. ముఖ్యంగా అనేక రహస్యాలతో రూప్ కుండ్ సరస్సు ఎన్నో ఉత్కంఠభరిత అనుభవాలను సందర్శకులకు అందిస్తుంది. ఈ సరస్సుకు సమీపంలో ఉన్న ట్రెక్ కు వెళ్తే మానవుల అవశేషాలు, అస్థిపంజిరాలు, ఎముకలు, పుర్రెలు రాళ్లపై కనిపిస్తాయి. దీనికి సంబంధించి అనేక ఫోటోలను సందర్శకులు సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తుంటారు. ఈ అస్థిపంజిరాలు సైనికులవాణి ఒక సిద్ధాంతం చెబుతుండగా, మరో సిద్ధాంతం ప్రకారం వీరంతా రాజ కుటుంబానికి చెందిన వారని, ఒక దేవత శాపం కారణంగా ఇలా మరణించారని చెబుతారు. దీనిపై ఎలాంటి స్పష్టత ఇప్పటి వరకూ లేకపోవడంతో ఇవి ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి.
 
​టైగర్స్ నెస్ట్ మోనస్టరీ
 
నిటారుగా ఉన్న ఒక కొండపై ఉన్న ఈ బౌద్ధ మఠం ఒక ఆసక్తికరమైన కధను కలిగి ఉంది. ఈ మఠం యొక్క హృదయ భాగం ఒక గుహలో ఉంటుంది. ఇక్కడ ప్రముఖ బౌద్ధ గురువు పద్మసంభవ మూడు సంవత్సరాల మూడు నెలల మూడు వారాల మూడు రోజుల మూడు గంటలు ధ్యానం చేసినట్లు నమ్ముతారు. ఇక్కడి రహస్యం ఈ ప్రదేశమే. నేటి కాలంలో కూడా దీని అధిరోహించడం ఎంతో కష్టతరమైన పని. గురు పద్మసంభవ టిబెట్ నుంచి టిగ్రెస్స్ పై శిఖరానికి వాయువేగంతో ఎగిరి వచ్చినట్లు ఒక నమ్మకం ఉంది. ఈ ప్రమాదకరమైన ప్రదేశాన్ని ఒక్కసారి చూస్తే ఆ నమ్మకం నిజమేనేమో అనిపిస్తుంది. ఈ రోజు ఇక్కడ ఇలా కనిపిస్తున్న ఈ మఠం 1692లోని ధ్యాన ప్రదేశంలో నిర్మించబడింది. ఇది నిజంగా ఒక గొప్ప ఘనత అని చెప్పవచ్చు.
​గంగ్ఖర్ పుయెన్సమ్
గంగ్ఖర్ పుయెన్సమ్ ప్రపంచంలోనే ఎత్తైన, అధిరోహించలేని పర్వతంగా ప్రసిద్ధి చెందింది. భూటాన్ లో ఉన్న ఈ పర్వతాన్ని ఎన్ని సార్లు కొలిచినా లెక్కలు ఒకదానితో ఒకటి ఎప్పుడూ సరిపోలడం లేదట. ఇది మానవ తప్పిదం కావచ్చు. కానీ ఇది ఇప్పటికీ అధిరోహించబడనిదిగా ఉండడంతో దీనిని ఓ రహస్య ప్రదేశంగా పిలుస్తున్నారు. భూటానీస్ లు ఈ ప్రాంతాన్ని దేవుళ్లు, యతిలు సహా అనేక పౌరాణిక జీవాలకు నిలయంగా నమ్ముతారు. ఎన్నో సార్లు దీనిని అధిరోహించేందుకు ప్రయత్నించి విఫలం కావడంతో చివరికి ఇది ఒక దిగ్గజంగా మిగిలిపోయింది. ఇక్కడ అనేక వింత సంఘటనలు, వర్ణించలేని శబ్ధాలు, విచిత్రమైన కాంతులు ఏర్పడుతున్నట్లు ఈ పర్వతానికి సమీపంలో నివసించే ప్రజలు చెబుతు
 
​గ్యాంగంజ్
 
హిమాలయాల యొక్క మారుమూలలో ఎవరూ ప్రవేశించలేనటువంటి ప్రదేశంలో అమర జీవులు ఉన్న పట్టణంగా గ్యాంగంజ్ ను విశ్వసిస్తారు. చాలా మంది పర్వతారోహకులు దీని ఖచ్చితమైన ప్రదేశాన్ని కనుగొనాలని ప్రయత్నించినప్పటికీ చివరికి చేదు అనుభవమే ఎదురైంది. ఆధునిక కాలపు శాటిలైట్లు, ఇతరాల మ్యాపింగ్ సాంకేతికత కూడా ఈ ప్రదేశాన్ని గురించడంలో విఫలమవుతుంది. టిబెట్, భారతదేశానికి చెందిన బౌద్ధులు గ్యాంగంజ్ కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదని, ఎంతో శక్తివంతమైనదని చెబుతుంటారు. ఇది కేవలం అర్హత గల సాధువులు, యోగులకు మాత్రమే గుర్తించేందుకు, చేరుకునేందుకు సాధ్యపడుతుందని, ఇక్కడ ఎవరైతే నివసించాలని కోరుకుంటారో వారు అమరత్వాన్ని పొందుతారని విశ్వసిస్తారు.