Eligeelu

ఎలిజీలు
పేజీలు : 279

200.00

Out of stock

మీ ఈమెయిల్ ఇచ్చిన యెడల, పుస్తకము స్టాక్ వచ్చిన వెంటనే మీకు ఈమెయిల్ పంపగలము

మరిన్ని Telugu Books కై
Tags: ,
Share Now

Description

Eligeelu
ఎలిజీలు
Pages : 279

ప్రతీసారి నిష్క్రమించిన ఎందరో సన్నిహితులు, పెద్దలు, మిత్రుల జ్ఞాపకాలతో ఈ పుస్తకం మరింత బెంగనీ, దు:ఖాన్నీ పెంచుకుంటూ ఉంది.

దువ్వూరి రామిరెడ్డి గారి మాటలు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటుంటాను : “మనమునకెక్కినట్టి అభిమానులు మిత్రులు చెల్లినారు, యౌవన మధుమాసమున్ కుసుమ భారము రాలిపోయె…”. ఈ పుస్తకంలో ప్రతీ పేజీ నా హృదయాన్ని బరువెక్కిస్తుంది. ఎన్ని జ్ఞాపకాలు! ఎంత దూరం ఈ ప్రయాణం. ఆయా వ్యక్తుల పరిచయం, సౌహార్థం అనే పుప్పొడితో ఈ జీవన మాధుర్యానికి రుచి పెరిగింది. వీరంతా ఈ జీవితాన్ని అలంకరించిన ఆప్తులు, జీవనయోగ్యం చేసిన ఓషదులు. ఈ ఆప్త వాక్యాలతో ఆయా వ్యక్తులను తలచుకోవడం ఓ నిస్సహాయమైన ఓదార్పు చరిత్రగా మిగిలే నిటూర్పు.

‘ఎలిజీ’ అంటే ఆప్త వాక్యం. ఆయా వ్యక్తుల పట్ల నా హృదయ స్పందన. అతి ఆర్థ్రమైన ఈ స్మృతి కావ్యాన్ని ఎప్పటికప్పుడు నింపుతూ, దీన్ని ఎప్పటికప్పుడు సమీకరిస్తూ – కేవలం అభిమానంతో ముద్రించే రచయిత, కవి, అత్యంత ఆప్తులు పెద్దిరెడ్డి గణేష్ గారు.

ఈయనంటాడు:
“ఆకాశానికే కాదు
అప్పుడప్పుడు ఆలోచనలకూ
అమావాస్య వస్తుంది”

ఎన్నో అమావాస్యల సంకలనం ఈ పుస్తకం. మా ఇద్దరికి సుతారమైన ‘ఆర్ధ్రత’ అనే పీటముడి ఉంది. లేకపోతే ఈ ఎలిజీలను గణేష్ కనీసం పదిహేను సంవత్సరాలుగా ఇలా గుత్తకు తీసుకోడు.

మరో ముద్రణ అంటే భయమేస్తుంది. మరెంతమంది ఆప్తులను నష్టపోతానో అని.

– గొల్లపూడి మారుతిరావు