Description
అచ్చతెలుగు రామాయణము ఒక తెలుగు కావ్యము. దీనిని కూచిమంచి తిమ్మకవి రచించాడు. పేరులో కొట్టవచ్చినట్లుగా రామాయణం గ్రంథాన్ని అచ్చతెలుగు లో రచించాడు తిమ్మకవి. ఇందులోని ఆరు కాండాలలో సుమారు 13 వందల పద్యాలు ఉన్నాయి.
ఆంధ్రభాషలో పదాలు నాలుగు రకములని వైయాకరుణులు తెలియజేశారు. అవి: తత్సమము, తద్భవము, దేశ్యము, గ్రామ్యము. ఇందులో తత్సమం రెండు విధములు: సంస్కృతసమము, ప్రాకృతసమము. సంస్కృత సమేతరమైన భాషనే అచ్చతెలుగు అంటారు. అందుచేత ఈ భాషలో ప్రాకృత సమాలు, తద్భవాలు, దేశ్యాలు ఉంటాయి. గ్రామ్యం లక్షణ విరుద్ధం కాబట్టి ప్రయోగానికి పనికిరాదని లాక్షణికులు చెప్పారు. కానీ ఆయాజాతుల ప్రయోగాన్ని బట్టి ఉపయోగించవచ్చని కొందరి అభిప్రాయం. ఇలాంటి అచ్చతెలుగులో వ్రాయబడిన రామాయణం కాబట్టి దీన్ని అచ్చతెలుగు రామాయణం అని వ్యవహరిస్తారు.
అహల్య తన కథను తానే రాముడికి చెప్పుకోవడం.
సుగ్రీవునితో స్నేహం చేస్తే కార్య సాఫల్యం జరుగుతుందని రామునికి చెప్పడం.
ఏడు తాటిచెట్లను ఒకే బాణంతో కొడితేగాని వాలిని గెలవలేడనే సిద్ధాంతం
లంకకు వెళ్ళేముందు హనుమంతుడు సీతాశిరోరత్నాన్ని తెస్తానని చెప్పడం.
కోతులను, కొండముచ్చులను కూడగట్టుకొని రాముడు నాతో యుద్ధమేమి చెయ్యగలడని రావణుడు ఎగతాళి చెయ్యడం.
లంకనుండి వచ్చేముందు హనుమంతుడు లంకిణితో యుద్ధం చేయడం.
నీలుని చేత కొండరాళ్లు వేయిస్తే తేలుతాయని వారధి కట్టడానికి సముద్రుడు ఉపాయం చెప్పడం.