Description
తొలి రచన “వ్యాస విద్య”, మలి రచన “ద్వాదశజ్యోతిర్లింగ మాహాత్మ్యం” ద్వారా విశేష పాఠకాదరణ పొందిన రచయితగా పిన్న వయసులోనే ఖ్యాతి గడించిన రచయిత్రి శ్రీమతి శ్రీవిద్య, 18 శక్తిపీఠాలు ప్రస్తుతకాలంలో ఏ యే ప్రాంతాలలో ఉన్నాయో తెలియజేస్తూ, ఆయా క్షేత్రాలతో ముడివడియున్న గాథలను, స్థలమాహాత్మ్యాన్ని అక్కడ చేయవలసిన పూజాదికాల విశేషాలను బ్రహ్మాండాది పురాణాలనుండి ఎంతో భక్తితో, ఆసక్తితో, శ్రమకోర్చి సంగ్రహించి, శాస్త్రప్రామాణికంగా సరళమైన రీతిలో, ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన శైలిలో గ్రంథస్తం చేసి, తమ మూడవ రచన “అష్టాదశ శక్తిపీఠాలు” గా మనకు అందించారు. చదివి తరించండి
సతీ దేవి శరీరం 18 ముక్కలై, 18 ప్రదేశాల్లో పడ్డాయని, వాటినే అష్టాదశ శక్తి పీఠాలు అంటారని మన పురాణాలు తెలుపుతున్నాయి. ఈ శక్తి పీఠాలు భారత దేశంతో సహా శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ వంటి మూడు దేశాలలో కూడా ఉన్నాయి. వాటితో ఒకటి కాశ్మీర్ లో ఉండగా, మరొకటి శ్రీలంకలో ఉంది. మిగతా 16 శక్తిపీఠాలు మన భారత దేశంలో ఉన్నాయి.