Sri Sarpa Tantram

శ్రీ సర్ప (నాగ) తంత్రం

Author: Swami Madhusudana Saraswati
Publisher: Mohan Publications
Pages: 318

360.00

Share Now

Description

Sri Sarpa Tantram Book 

శ్రీ సర్ప (నాగ) తంత్రం

Author: Swami Madhusudana Saraswati
Publisher: Mohan Publications
Pages: 318
Naga Devata Ashtottara Shata Namavali (108 names)
నాగదేవతాష్టోత్తరశతనామావలిః
ఓం అనన్తాయ నమః ।
ఓం ఆదిశేషాయ నమః ।
ఓం అగదాయ నమః ।
ఓం అఖిలోర్వేచరాయ నమః ।
ఓం అమితవిక్రమాయ నమః ।
ఓం అనిమిషార్చితాయ నమః ।
ఓం ఆదివన్ద్యానివృత్తయే నమః ।
ఓం వినాయకోదరబద్ధాయ నమః ।
ఓం విష్ణుప్రియాయ నమః ।
ఓం వేదస్తుత్యాయ నమః ॥ ౧౦॥

ఓం విహితధర్మాయ నమః ।
ఓం విషధరాయ నమః ।
ఓం శేషాయ నమః ।
ఓం శత్రుసూదనాయ నమః ।
ఓం అశేషపణామణ్డలమణ్డితాయ నమః ।
ఓం అప్రతిహతానుగ్రహదాయాయే నమః ।
ఓం అమితాచారాయ నమః ।
ఓం అఖణ్డైశ్వర్యసమ్పన్నాయ నమః ।
ఓం అమరాహిపస్తుత్యాయ నమః ।
ఓం అఘోరరూపాయ నమః ॥ ౨౦॥

ఓం వ్యాలవ్యాయ నమః ।
ఓం వాసుకయే నమః ।
ఓం వరప్రదాయకాయ నమః ।
ఓం వనచరాయ నమః ।
ఓం వంశవర్ధనాయ నమః ।
ఓం వాసుదేవశయనాయ నమః ।
ఓం వటవృక్షార్చితాయ నమః ।
ఓం విప్రవేషధారిణే నమః ।
ఓం త్వరితాగమనాయ నమః ।
ఓం తమోరూపాయ నమః ॥ ౩౦॥

ఓం దర్పీకరాయ నమః ।
ఓం ధరణీధరాయ నమః ।
ఓం కశ్యపాత్మజాయ నమః ।
ఓం కాలరూపాయ నమః ।
ఓం యుగాధిపాయ నమః ।
ఓం యుగన్ధరాయ నమః ।
ఓం రశ్మివన్తాయ నమః ।
ఓం రమ్యగాత్రాయ నమః ।
ఓం కేశవప్రియాయ నమః ।
ఓం విశ్వమ్భరాయ నమః ॥ ౪౦॥

ఓం శఙ్కరాభరణాయ నమః ।
ఓం శఙ్ఖపాలాయ నమః ।
ఓం శమ్భుప్రియాయ నమః ।
ఓం షడాననాయ నమః ।
ఓం పఞ్చశిరసే నమః ।
ఓం పాపనాశాయ నమః ।
ఓం ప్రమదాయ నమః ।
ఓం ప్రచణ్డాయ నమః ।
ఓం భక్తివశ్యాయ నమః ।
ఓం భక్తరక్షకాయ నమః ॥ ౫౦॥

ఓం బహుశిరసే నమః ।
ఓం భాగ్యవర్ధనాయ నమః ।
ఓం భవభీతిహరాయ నమః ।
ఓం తక్షకాయ నమః ।
ఓం లోకత్రయాధీశాయ నమః ।
ఓం శివాయ నమః ।
ఓం వేదవేద్యాయ నమః ।
ఓం పూర్ణాయ నమః ।
ఓం పుణ్యాయ నమః ।
ఓం పుణ్యకీర్తయే నమః ॥ ౬౦॥

========
Sri Sarpa Tantram
శ్రీ సర్ప (నాగ) తంత్రం
Author: Swami Madhusudana Saraswati
https://devullu.com/books/sri-sarpa-tantram/
—————

ఓం పటేశాయ నమః ।
ఓం పారగాయ నమః ।
ఓం నిష్కలాయ నమః ।
ఓం వరప్రదాయ నమః ।
ఓం కర్కోటకాయ నమః ।
ఓం శ్రేష్ఠాయ నమః ।
ఓం శాన్తాయ నమః ।
ఓం దాన్తాయ నమః ।
ఓం ఆదిత్యమర్దనాయ నమః ।
ఓం సర్వపూజ్యాయ నమః ॥ ౭౦॥

ఓం సర్వాకారాయ నమః ।
ఓం నిరాశాయాయ నమః ।
ఓం నిరఞ్జనాయ నమః ।
ఓం ఐరావతాయ నమః ।
ఓం శరణ్యాయ నమః ।
ఓం సర్వదాయకాయ నమః ।
ఓం ధనఞ్జయాయ నమః ।
ఓం అవ్యక్తాయ నమః ।
ఓం వ్యక్తరూపాయ నమః ।
ఓం తమోహరాయ నమః ॥ ౮౦॥

ఓం యోగీశ్వరాయ నమః ।
ఓం కల్యాణాయ నమః ।
ఓం వాలాయ నమః ।
ఓం బ్రహ్మచారిణే నమః ।
ఓం శఙ్కరానన్దకరాయ నమః ।
ఓం జితక్రోధాయ నమః ।
ఓం జీవాయ నమః ।
ఓం జయదాయ నమః ।
ఓం జపప్రియాయ నమః ।
ఓం విశ్వరూపాయ నమః ॥ ౯౦॥

ఓం విధిస్తుతాయ నమః ।
ఓం విధేన్ద్రశివసంస్తుత్యాయ నమః ।
ఓం శ్రేయప్రదాయ నమః ।
ఓం ప్రాణదాయ నమః ।
ఓం విష్ణుతల్పాయ నమః ।
ఓం గుప్తాయ నమః ।
ఓం గుప్తాతరాయ నమః ।
ఓం రక్తవస్త్రాయ నమః ।
ఓం రక్తభూషాయ నమః ।
ఓం భుజఙ్గాయ నమః ॥ ౧౦౦॥

ఓం భయరూపాయ నమః ।
ఓం సరీసృపాయ నమః ।
ఓం సకలరూపాయ నమః ।
ఓం కద్రువాసమ్భూతాయ నమః ।
ఓం ఆధారవిధిపథికాయ నమః ।
ఓం సుషుమ్నాద్వారమధ్యగాయ నమః ।
ఓం ఫణిరత్నవిభూషణాయ నమః ।
ఓం నాగేన్ద్రాయ నమః ॥ ౧౦౮॥

॥ ఇతి నాగదేవతాష్టోత్తరశతనామావలిః ॥

భారతదేశము అత్యంత పవిత్రమైన విశిష్టమైన సనాతనమైన సంస్కృతికి, ధర్మమునకు, పలు ఆరాధనలకు నిలయము. ప్రకృతిలోని పర్వతాద్యచేతనములలో కూడ దైవాంశను దర్శించి కొలిచిన భారతీయులు పలురీతులలో ప్రత్యేకతలను కల నాగములను ఆరాధించుటలో వింత ఏమియును లేదు. కాని Ferguson వంటి పాశ్చాత్య విమర్శకులు కొందఱు నాగారాధన ప్రాచీనార్య సంస్కృతికి చెందినది కాదని, ప్రాయశ: అది ద్రావిడ సంస్కృతి ప్రభావము వలన ఆర్య సంస్కృతిలో ప్రవేశించి యుండునని వాదించుచు, అందులకు ప్రోద్బలకముగా ఆర్య సాహిత్యములో మిక్కిలి ప్రాచీనముగా భావింపబడు ఋగ్వేదములో ఎచటను నాగారాధన ప్రసక్తి లేకుండుటను పేర్కొనిరి. ఈ వాదము ఎంత మాత్రము పసలేదని J. Ph. Vogel వంటి విదేశీయ పండితులు సహేతుకముగా నిరాకరించుచు, అందులకు ప్రముఖ నాగవిశేష బోధకములైన నామపదములన్నియు ఆర్యభాషా మూలకములగుట వంటి పలు నిదర్శనములను చూపిరి. Vogel పండితుడు “Indian Serpent” అను గొప్ప ఆంగ్ల గ్రంథములో ఈ విషయమును ప్రస్తావించుచు “In this connection it may be noted that the mystic snake – kings bear personal names which almost invariably are not Dravidian, but purely Aryan” – అని విశ్లేషించుట గమనార్హము. ఈ నాగారాధన భారతమున సర్వత్ర విస్తరించుటయే కాక ఇండోనేషియా, చైనా, జపాన్‌, శ్రీలంక, బర్మా వంటి ఇరుగుపొరుగు దేశములందును వ్యాపించినది. ఇందులకు భారతీయ సంస్కృతి ప్రభావమే కారణమని తలచు విమర్శకులును పలువురు కలరు. ఈ నాగారాధన ప్రభావము కేవలము వైదిక సంప్రదాయమునందే కాక, బౌద్ధ సంప్రదాయమున, తన్మత గ్రంథములలో జాతక కథలలో విస్తృతముగా కలదు. భారతములోని నాగారాధనకు, నాగములకు సంబంధించిన పలు అంశములను Vogel పండితుడు అద్భుతముగా వివరించి విశ్లేషించెను. ఇవియే కాక ఇంకను అనేకములైన అంశములు వేద ఇతిహాస పురాణాదులలో కానవచ్చు చున్నవి. వీనిలో కొన్ని మాత్రము ఇచట స్థాలీపులాకన్యాయమున సంగ్రహముగా ప్రస్తావింపబడుచున్నవి.- ఈ.ఏ. శింగరాచార్యులు

-Nataraja Sharma Bhagavathula