Sri Kasi Visalakshi Tantram

శ్రీ కాశీవిశాలాక్షి తంత్రమ్

Author: Swami Madhusudana Saraswati
Pages: 344

300.00

Share Now

Description

Sri Kasi Visalakshi Tantram Book

శ్రీ కాశీవిశాలాక్షి తంత్రమ్

Author: Swami Madhusudana Saraswati
Pages: 344
  మన గురుదేవులు అందించిన శ్రీ నిఖిల తంత్రాలలో శ్రీస్వామి మధుసూదన సరస్వతిగారు వ్రాసిన ప్రతి పుస్తకము ఆయా దేవత గురించి వివరంగా ఆ దేవత ఎందుకు ఉద్భవించిందో ఆయా దేవతను ఎవరెవరు సాధన చేసారో వారికి కలిగిన వచ్చిన జరిగిన విజయాలను మనకు వివరంగా తెలియచేసారు. అది కూడా మనకు అర్థం అయ్యే విధంగా వ్రాసేవారు. ఆయన వ్రాసిన ప్రతి పుస్తకము ఒక శక్తితో భక్తితో కూడినవి.
అలాగే ఈ పుస్తకము “శ్రీ కాశీవిశాలాక్షీ తంత్రం” ను కూడా ఆయనే రచించారు.
   సమస్త ప్రాణులలోను శక్తి రూపంలోవున్న అమ్మకు నమస్కారము. అన్నది మార్కండేయపురాణం. ఈ నామ రూపాత్మక ప్రపంచమంతా పరాశక్తి వ్యాపించివున్నది అన్నది యజుర్వేదం. శక్తిలేని పదార్థమేదీ చలించజాలదు.
   శివశక్తులు వేరుకాదు. శివుడిలో అర్థభాగమే శక్తి. శక్తిలేనిదే సృష్టి ముందుకు నడవదు. ఎందుకంటే ఈ సృష్టిలో సృష్టించబడ్డ ప్రతిప్రాణి శక్తి యొక్క స్వభావంవలననే సృష్టింపబడింది. ప్రతీదేవతరూపం రాయిలో నుండే సృష్టించబడిందే. అలాగే ప్రకృతికి ప్రతిరూపంగా కొలిచే కాళీ కూడా సృష్టిలోనిదే. ఉదయం మనం నిద్రలేచిన మొదలు మనం ఉపయోగించే ప్రతీ వస్తువులోను, మనం చేసే ప్రతీ పనిలోను మనం మాట్లాడే ప్రతి మాటలోను ఆ శివశక్తులు ఉన్నాయి.