Description
Maya Pratyangira Tantram Book
Author: Swami Madhusudana Saraswati
Pages: 224
మాయాప్రత్యంగిర ప్రారంభించింది. “అక్కా! అసలు నీకు ఎన్ని రూపాలు ఉన్నాయో నీకుతెలుసా? తెలియదు! అన్నట్టు అడ్డంగా తలవూపింది లక్ష్మి. పోనీ నీ సంతానానికైనాతెలుసా? వారికి కూడా తెలియదు నాకు మాత్రం తెలుసు. ఎందుకంటే నువ్వు ఎక్కడికైతే ప్రవేశించలేవో అక్కడ నేను ఉంటాను. అందుకే నేను ఇప్పటి వరకూ నీకు కనిపించలేదు. నిజమాచెల్లీ? ఏది మరికాస్త వివరించు. మళ్ళీ మాయా ప్రత్యంగిర ప్రారంభించింది. నువ్వు ధైర్యలక్ష్మివి. ధైర్యం రూపంలో వాళ్ళ గుండెల్లో ఉంటావు నువ్వు. కాని అటువంటి వాళ్ళను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. ధైర్యం అంటే అందరితో దెబ్బలాడ్డం కాదు. ధైర్యంగా తనకు ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోనడం. అన్నిటికన్నా ముఖ్యమైన ధైర్యం ఇతరుల లోపాలు ఎంత ధైర్యంగా ఎత్తిచూపుతామో అంతే ధైర్యంగా తనలోపాలు ఒప్పుకోగలగాలి. కాని చాలా మందికి ఇది సాధ్యంకాదు. ప్రపంచంలో ఎవ్వరినైనా ఎదుర్కోవచ్చు. మనిషి తనని తాను ఎదుర్కోలేడు. నీకు తెలియనిది ఏముంది సింహావలోకనలక్ష్మీ! ప్రపంచంలో ఎవ్వరినైనా మోసం చెయ్యవచ్చు. కాని తనని తాను మోసం చేసుకోలేరు.