Dasa Mahavidhya Pooja

దశమహావిద్య పూజకల్పం

450.00

Share Now

Description

Dasa Mahavidhya Pooja Book (Telugu)

1. కాళీ

2. తార

3. త్రిపుర సుందరి

4. ధూమావతి

5. భువనేశ్వరి

6. భైరవి

7. ఛిన్నమస్త

8. మాతంగి

9. బగళాముఖి

10. కమలాత్మిక

 

ఈ దశ మహా విద్యల తత్వాన్ని చూస్తే, అవి ఇలా సూచిస్తాయి.

కాళీ, ఛిన్నమస్త – కాల పరిణామము

తార, మాతంగి – వాక్కు, వ్యక్తావ్యక్తము

త్రిపుర సుందరి, కమల – ఆనందము, సౌందర్యము

భువనేశ్వరి, ధూమావతి – అంతరాళము, అతీత పరబ్రహ్మ శక్తి

భైరవి, బగళాముఖి – శక్తి, గతి, స్థితి

(దశ మహావిద్యలు – శ్రీ కొమరవోలు వెంకట సుబ్బా రావు, విజ్ డం – డేవిడ్ ఫ్రాలీ )

1. తొలి మహా విద్య శ్రీకాళీదేవి

కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.

2వ మహావిద్య శ్రీతారాదేవి

దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.

3వ మహా విద్య శ్రీషోడశీదేవి

అరుణారుణ వర్ణంతో ప్రకాశించే *శ్రీషోడశీదేవి* దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.

4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి

దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.

5వ మహావిద్య శ్రీ త్రిపుర భైరవీ దేవి

దశమహావిద్యలలో 5వ మహా విద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పారాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.

6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి

దశ మహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది.

7వ మహావిద్య శ్రీ ధూమవతీ దేవి

దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతి దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.

8వ మహావిద్య శ్రీ జగళాముఖీ దేవి

దశమహావిద్యలలో 8వ మహావిద్య.. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ జగళాముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.

9వ మహావిద్య శ్రీ మాతంగీదేవి

దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవి కి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.

10వ మహావిద్య శ్రీ కమలాత్మికాదేవి

పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తిపొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈదేవికి మార్గశిరే అమావాస్యతిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.

దశమహామహావిద్య-గ్రహములు సంబంధం.
ఓం నమః శివాయ..!!దశ మహావిద్యలకు గ్రహములకు సంబంధము కలదు అని కొందరంటారు.
కాని దీనికి ప్రమాణము లేదు.
వీరికి విష్ణు భగవానుని దశావతారములకు సంబంధము కలదు అని కొన్ని తంత్రగ్రంధములలో ఉన్నది.
కాని అది తరువాతి వారి కపోలకల్పనగా తోస్తుంది.
సంధ్యావందన మంత్రములలో దిగ్దేవతా నమస్కారము అని వస్తుంది.
పది దిక్కులలో ఉన్న దేవతలను స్మరించి నమస్కరించుట జరుగుతుంది.దశదిశలు అనే మాట అందరికీ తెలుసు.
అష్ట దిక్కులు, పైన, క్రింద కలిపి దశ దిశలు.
తంత్ర గ్రంథములలో సతీదేవి పది రూపములు ధరించి దశ దిశలను ఆక్రమించిన గాధలు కలవు.
వారే దశ మహావిద్యలు.
దిక్కులకు గ్రహములకు ఆధిపత్య రీత్యా సంబంధము కలదు.
ఆ విధముగా చూస్తె జ్యోతిషమునకు
దశ మహా విద్యలకు సంబంధము కనిపిస్తుంది.లగ్నము-లలితాత్రిపుర సుందరి ,
రవి-త్రిపుర భైరవి,
చంద్ర-భువనేశ్వరి,
కుజ-బగలా ముఖి ,
బుధ-మాతంగి,
గురు-తార,
శుక్ర-కమలాత్మిక,
శని-కాళి,
రాహు-ఛిన్నమస్త,
కేతు-ధూమవతిదశ మహావిద్యలలో ఎవరికీ వారే గొప్పవారు.
వీరు ప్రత్యెక దేవతలు కారు.
జగన్మాత యగు ఆద్యాశక్తి యొక్క వివిధ రూపములు.
కనుక ఎవరిని ఉపాసించినా భుక్తి ముక్తులను ఇవ్వగలరు.
కాని వారివారి లక్షణములను బట్టి
ఒక్కొక్క ప్రత్యేకవరమును అధికముగా ఇవ్వగలరు. కనుక జాతకమున గల ఒక్కొక్క దోషమునకు ఒక్కొక్క మహావిద్య ఉపాసన శ్రేష్టము.అన్నింటికీ లగ్నము మూలము.
కనుక దేవీ ఉపాసనలలో లలితా ఉపాసన ముఖ్యము అని కొందరి అభిప్రాయము.
లలితా ఉపాసన యగు శ్రీవిద్య సర్వశ్రేష్ట విద్య.

దానిని ప్రక్కన ఉంచితే, జ్యోతిష పరంగా చూస్తే గ్రహములలో అత్యంత శుభ గ్రహములు
గురు శుక్రులు.
కనుక విద్యలలో సౌమ్యమైనవి,
భయము గొలుపనివి తార మరియు కమల.
వీరే సరస్వతి మరియు లక్ష్మి.
వీరు సాత్విక దేవతలు.

రవి కుజులు రాజసిక గ్రహములు.
కనుక త్రిపుర భైరవి, బగళాముఖి రాజసిక దేవతలు. వీరు ఉగ్రరూపులు.
వీరి ఉపాసన కష్టతరము.

ఇక బుధచంద్రులు మిశ్రమ గ్రహములు.
అనగా వారి స్థితిని బట్టి మంచీ చెడూ రెండూ
చేయ గలరు.
కనుక మాతంగి, భువనేశ్వరి అనువారు
వీరికి అధిదేవతలు.
వీరి ఉపాసన సాత్వికమునకు,
రాజసమునకు మధ్యస్తంగా ఉంటుంది.

ఇక మిగిలినది శనీశ్వరులు.
వీరికి కాళి అధిదేవత.

రాహుకేతువులకు ఛిన్నమస్త, ధూమావతులు అధిదేవతలు.
వీరి ఉపాసన బహు కష్టతరము.
వివిధ ఆటంకములు,
భయమును గొలిపే పరీక్షలతో కూడి ఉంటుంది. అంత మాత్రాన వీరిని తామసిక దేవతలు అనుట తప్పు.

వీరందరికీ ప్రత్యేక యంత్రములు,
మంత్రములు, తంత్రము ఉంటాయి.
మంత్ర భేదములు కూడా కలవు.
ఒక్క తారామంత్రములే దాదాపు పది వరకు కలవు. ఇక కాళీ మంత్రములు అనేకములు కలవు.
వీటిలో చిన్నవైన బీజ మంత్రముల నుండి దండకముల వంటి మాలామంత్రముల వరకు
అనేక రకములు కలవు.

ఏదైనా, సాధకుని స్థితిని బట్టి,
అర్హతను బట్టి ఉపాసన ఉంటుంది.
ఉపాసనా రహస్యములను గురుముఖతా గ్రహించుట మంచిది.

గురువు అనబడే వానికి కొన్ని అర్హతలు ఉండాలి.
ఉపదేశింపబడే మంత్రములో ఆయన సిద్ధి
పొంది ఉండాలి.
అపుడే అది సిద్ధ మంత్రము అవుతుంది.
అంతే గానీ.. పుస్తకాల్లో చదివేసి..
నేను ఇన్ని మంత్రాలు..చేసాను..
అన్ని మంత్రాలు సిద్ధిపొందేశాను అనీ..
ప్రగల్బాలు పలికితే సరికాదు..
మంత్ర ఉపాసనా విధానాన్ని శిష్యునకు ఉపదేశించగల జ్ఞానము కలిగి ఉండాలి.
అప్పుడే ఆ మంత్రము సిద్ధిస్తుంది.
గురువు పూర్తిగా నిస్వార్థ పూరితుడై ఉండాలి.
బ్రహ్మ వేత్త అయి ఉండాలి.
కోరికలకు అతీతుడై ఉండాలి.
నియమ నిష్టాగరిష్టుడై ఉండాలి.
చపలచిత్తం ఉండకూడదు.

అలాగే శిష్యుడు కూడా నిర్మలుడు,
బ్రహ్మచర్య దక్షుడు,
సాధన యందు పట్టుదల కలిగినవాడు,
సత్యకాంక్షి అయి ఉండాలి.
అప్పుడే తంత్రమైనా మంత్రమైనా సిద్ధిస్తుంది. లేకుంటే సిద్ధి కలుగదు..!!
స్వస్తి..!!

ఓం నమః శివాయ..!!
సర్వే జనా సుఖినోభవంతు..!!

శ్రీ మాత్రే నమః

#kalabhairava