Description
Sri Maha Pratyangira Pooja Kalpam
-Dr. Jayanti Chakravarthi
శ్రీ మహాప్రత్యంగిరా పూజాకల్పం
నేడు దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా ప్రభావాన్ని చూపే దేవతగా శ్రీ మహాప్రత్యంగిరా దేవి ఎంతో ప్రసిద్ధి పొందింది. తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లలో శ్రీ మహాప్రత్యంగిరా దేవి ఆలయాలు నిర్మించబడుతున్నాయి. ఎందరో భక్తులు ప్రత్యంగిరా దేవి పూజలు చేసి – చేయించుకొని ఆశ్చర్యకరమైన ఫలితాలు పొందుతున్నారు. వారి వారి కష్టాలను పోగొట్టుకుంటున్నారు. శ్రీ ప్రత్యంగిరా దేవి భక్తులందరూ స్వయంగా వారి ఇళ్ళలో నిత్యపూజ చేసేందుకు అనుగుణంగా శ్రీ మహాప్రత్యంగిరా పూజాకల్పం అనే గ్రంథాన్ని సంకలనం చేసి అందిస్తున్నము.
ఈ గ్రంథంలో శ్రీ మహాప్రత్యంగిరా దేవి షోడశోపచార పూజావిధానంతో పాటు, అధర్వణ వేదంలోని ప్రత్యంగిరా ఋక్కుల పారాయణా విధానాన్ని, ప్రత్యంగిరా కవచ స్తోత్రాన్ని, శ్రీ ప్రత్యంగిరా సహస్రనామ స్తోత్రాన్ని, నామావళిని అనుబంధంగా అందిస్తున్నాము
ఇందులో తెలిపిన విధంగా భక్తులందరు శ్రీ ప్రత్యంగిరా దేవిని పూజించి తమ తమ కష్టాలను పోగొట్టుకోవలసిందిగా కోరుతూ, అందరికీ శ్రీ మహా ప్రత్యంగిరా దేవి దివ్యానుగ్రహం కలగాలని ఆశిస్తూ….– డా. జయంతి చక్రవర్తి