Description
జ్యోతిషము వలెనే సంఖ్యాశాస్త్రము కూడా ఒక గుప్త శాస్త్రం. దీనితో అత్యంత గూఢమైన విషయాలను తెలుసుకోవచ్చని భారతీయులకు తెలుసు. కానీ భారతీయులు జ్యోతిషమునకు ప్రాధాన్యత నిచ్చినందువలన సంఖ్యాశాస్త్రం కూడా జ్యోతిషమందే అంతర్భాగమైపోయింది. మెసొపొటేమియా నాగరికత విస్తరిల్లి ఉన్న కాలములో కాల్దీ దేశీయులు సంఖ్యాసాస్త్ర జ్యోతిషమును ప్రతిభావంతముగా వాడుకొనినట్లు చారిత్రక ఆధారములు స్పష్టము చేయుచున్నవి. వీరు అక్షరములకు కూడా అంకెలు అనుసంధానం చేసి పదమునందలి గూఢ అర్థమును చెప్పగలిగి ఉండిరి. దీనికి కబాలా పద్ధతి అని పేరు పెట్టబడినది. దీనిని పాశ్చాత్యులు గ్రహించిఫలవిషయములను విశేషముగా పరిశోధించి ‘న్యూమరాలజీ’ పేరుతో ఈ శాస్త్రమును అన్ని దేశములకు అందించినారు -శ్రీ లింగం వీరభద్రకవి