Description
Pratyangira Krutya Tantram
ప్రత్యంగిరా కృత్యా తంత్రం
Pratyangira Krutya Tantram
ప్రత్యంగిరా కృత్యా తంత్రం
Pratyangira Krutya Tantram
ప్రత్యంగిరా కృత్యా తంత్రం
Pratyangira Krutya Tantram
ప్రత్యంగిరా కృత్యా తంత్రం
Pratyangira Krutya Tantram
ప్రత్యంగిరా కృత్యా తంత్రం
ప్రస్తుత కాలములో తంత్రం అంటే అదేదో చెడు చేయడం అని, రహస్యంగా కుట్రలు పన్నటం అని అందరూ అనుకుంటున్నారు. దాన్ని తంత్రం అనరు.
“కుతంత్రం” అంటారు. ఒక కార్యాన్ని విజయవంతం చేయడానికి ఇష్ట కార్య సిద్ధి జరగడానికి కొన్ని మంత్రాలను, వస్తువులను, ఉపయోగించి చేసే కార్యక్రమమే “తంత్రము”.
తంత్రం అనేది ఒకశక్తి గల మంత్రముతో గూడిన సాధనం లాంటిది. ఆ సాధనమును శత్రు సంహారనకి ఉపయోగించవచ్చు. చెడు సంకల్పముతో చెడు కార్యములకు ఉపయోగించవచ్చు.
కత్తితో ఫలములను, దర్బలను కోయవచ్చు, జీవహింస చేయవచ్చు. అది చేసే వారి ఆలోచనా సంకల్పమును బట్టి నిర్దేశించబడుతుంది.
మంచికి చేస్తే మంచి ఫలితమును, చెడుకు చేస్తే చెడు ఫలితమును పొందటం జరుగుతుంది.
భారతములో శకుని తంత్రమును ఉపయోగించి తన ఇష్టకార్య సిద్ధి జరపుకోవటానికి తంత్ర విద్య ద్వారా మాయా జూదమును జరిపించాడు.
అందుకారణంగా అది చెడు అవటం వలన అప్పటికి మాత్రం వారి కార్యం విజయవంతం అయింది కానీ కౌరవులు పాచికల రూపములో ప్రేతత్మలను
ఉపయోగించి ఈ చెడు బుద్ధితో చేసిన పాప తాంత్రిక కర్మ వలన చివరకు సర్వ నాశనం అయిపోయారు. చేసే సంకల్పమును బట్టి ఈ తంత్ర విద్యల ద్వారా ఫలితం పొందటం జరుగుతుంది.
ఆ శ్రీ కృష్ణుడు తాను సృష్టించిన మంచికి , ధర్మానికి చెడు ఎదురవుతున్న సంధర్భములో ఆ చెడును నిర్మూలించగల శక్తి ఆ పరమాత్మకి ఉన్నప్పటికి,
తంత్ర విద్యల ద్వారా మానవ రూపములో ఉన్న పాండవుల ద్వారా ప్రయోగింపజేసి నిర్మూలించాడు. ఇందులో సూక్ష్మం ఏమిటంటే కర్మఫలం వలన
మానవుడు ఎదుర్కొనే చెడు కర్మలకు నిర్మూలనా మార్గాలను తంత్ర విద్యల రూపములో ఆ శ్రీమహా విష్ణువే వరంగా ప్రసాదించాడు.
Pratyangira Krutya Tantram
ప్రత్యంగిరా కృత్యా తంత్రం
మనం ఎదుర్కొంటున్న శత్రు సమస్యలను, వారు చేసే/చేయించే అభిచార కర్మలను, మనమే తొలగించుకునేలా తంత్ర విద్యలను ప్రసాదించాడు.
ఎంతో శక్తివంతులు మరియు శూరులు, ధీరులు, ధర్మ పరాయణులైన పాండవులు శత్రు సంహారానికి తంత్రాలను ఉపయోగించడం జరిగింది.
చరిత్ర లోకి వెళితే అను ఆయుధాలు తంత్ర విద్యలే కదా? మహాభారతములో ఉపయోగించబడిన అత్యంత శక్తివంతమైన ఆచరణకి కష్ట సాధ్యమైయన నాగాస్త్రం,దీనినే వశీకరణ అస్త్రం అని కూడా అంటారు.
ఆగ్నేయాస్త్రం, కుజాస్త్రం ఇది కుజుడికి సంబంధించినది, పాశుపతాస్త్రం ఇది మహా శివుడికి సంబంధించినది. వాయువ్యాస్త్రం ఇది కేతువు , వాయు దేవునికి సంబంధించినది.
వారుణాస్త్రం ఇది వరుణ దేవుడికి సంబంధించినది. ఇలా ఎన్నెన్నో శస్త్ర అస్త్రాలు అధర్వణ వేదములోని భాగాలే.
అంటే ఇక్కడ మనము తెలుసుకోవలసినది ఏమిటంటే ఈ శస్త్ర అస్త్రాలు అన్నీ కూడా తాంత్రిక విద్యలే.
రాక్షస పీడను, శత్రు పీడను, నిర్మూలించడం కోసం రూపొందించబడినవే ద్వాపర యుగములో ,త్రేతా యుగములో కూడా రాక్షస పీడను
నిర్మూలించి లోక కళ్యాణం కోసం ఈ శస్త్ర అస్త్రాలను ఉపయోగించక తప్పలేదు. ఇందులో మర్మం ఏమంటే పైశాచికతను నిర్మూలించడమే.
కొంచెం శ్రద్ధగా గమనిస్తే ఇందులోని మర్మం మీకు అర్ధమౌతుంది.రాముడు చేసింది లోక కళ్యాణర్థం. రావణుడు చేసింది స్వధర్మం కోసం. స్వధర్మం అనగా పాప కర్మ అనుభవించడం.
ఉదాహరణకు మీరు ఒక వస్త్ర దుకాణం నడుపుతున్నారు ,మీ వ్యాపారం బాగా సాగాలి అని మీరు కోరుకుంటారు. మీ వ్యాపార పరంగా బాగా ధనార్జన చేయాలి ఆశిస్తారు.
ఈ సంధర్భములో మీ వ్యాపార పోటీదారులు శత్రువులుగా మారి మీపై, మీ కుటుంబముపై, మీ వ్యాపారములపై కుతంత్రములు జరిపించి మీ సర్వ వినాశనానికి పూనుకుంటారు .
అందుకోసం ఎన్నో మీ శత్రువులు ఎన్నో ఘాతుకాలకు పాల్పడతారు. ఆ స్వార్థపూరితమైన, పాప గ్రస్తమైన ఆలోచనలతో మిమ్ములను దెబ్బతీయుట కోసం,
మీ పై కుతంత్రములు ప్రయోగించి నాశనం చేయుట కోసం కుతంత్ర విద్యలు చేసేవారిని సంప్రదించడం జరుగుతుంది.
Pratyangira Krutya Tantram
ప్రత్యంగిరా కృత్యా తంత్రం
వారి ఉద్యోగ, వ్యాపారాభివృద్ధి బాగుండాలని ఇతరుల వ్యాపారాలు సన్నగిల్లలని ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకోసం ఎన్నో ఘాతుకాలకు పాల్పడుతూ ఉంటారు.
ఈ సంధర్భములో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎవరికైతే పైశాచిక గ్రహ పీడ ఉంటుందో, వారు తప్పనిసరిగా ఈ కుతంత్ర విద్యల వలన ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది.
ఇది జాతకములోని అవయోగాలకు మూలం. ఎవరికైతే జాతకములో అవయోగాలు ఉంటాయో, వారు ఈ కుతంత్ర విద్యలకు గురి కావడం జరుగుతుంది. అంటే ఒక విధంగా ఇది కూడా పూర్వజన్మ పాప కర్మ ఫలమే.
ఆ పాపమును ప్రక్షాళన చేయడానికి విరుగుడుగా తాంత్రిక పరిహారములను చేసుకోక తప్పదు. మరి అలాంటి సందర్భాలలో తంత్ర విద్యలను ఉపయోగించి ఆ పైశాచిక ప్రభావాన్ని నిర్మూలించక తప్పదు.
ఎదుటివారి పై తంత్ర విద్యలు ప్రయోగించాలన్న వారికి పూర్వ జన్మ పాపాలు, శాపాలు అధికంగా ఉంటేనే అవి వారిపై ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే చేసే ప్రతి క్రియ కూడా కర్మ ఫలమే. అది మంచి గాని,చెడు గాని.
పైశాచిక గ్రహాల చెడు ప్రభావము నిర్మూలించడానికి మాత్రమే తంత్ర విద్యలు ఉపయోగపడతాయి.
మన నుదిటి వ్రాత ఆ బ్రహ్మ ఆజ్ఞనుసారంగా జరుగుతుంది. మనిషి ఎదుర్కొంటున్న బాధను తన బాధగా స్వీకరించే ఆ పరమాత్మ ఆ బాధని తొలగించడం కోసం తంత్ర మార్గాలను అధర్వణ వేదం ద్వారా మనకు ప్రసాదించాడు.
ఇందులో ఆంతర్యం ఏమిటంటే, వర్షం వచ్చినపుడు గొడుగును ఉపయోగించడం వలన ఆ వర్షం నుండి తడవకుండా ఉండగలుగుతాము. వర్షం పడటం బ్రహ్మ మనపై చూపించే నుదిటి వ్రాత .
మండుటెండ కాచినపుడు పాదరక్షలు ధరించడం ఆ వేడి తాపము నుండి కాళ్ళు కాలకుండా రక్షించుకోవటం. వేడి తాపం అనేది సూర్య గ్రహ రూపములో బ్రహ్మ మనపై చూపించే నుదుటి వ్రాత.
వర్షం నుండి , సూర్య తాపము నుండి కాపాడే గొడుగు, పాదరక్షలు గ్రహ దోష నివారణా మార్గాలు లాంటివి. విధిని తప్పించుకోవటం కష్టం కానీ తామస, రజో లక్షణాలు కలిగిన శత్రు పీడ నివారణా,
అభిచార కర్మలను తంత్ర విద్యల ద్వారా నిర్మూలించవచ్చు.
ఈ తంత్ర విద్యలను అభ్యసించిన వారు వీలైనంతవరకు ధర్మాచారణ లోక కళ్యాణర్థం ఉపయోగించవలెను.
Pratyangira Krutya Tantram
ప్రత్యంగిరా కృత్యా తంత్రం
అలా కాకుండా కామ క్రోధ మధ మత్సర్యాలతో, అసూయతో, ఈర్ష్యా ద్వేషాలతో ఇతరులపై ధనం కోసం, కామం కోసం, అధికారం కోసం
ఉపయోగిస్తే అప్పటికప్పుడు కౌరవులు పొందినట్టుగా తాత్కాలిక సౌఖ్యమును, కార్యసిద్ధిని పొంది చివరకు మనో భ్రాంతికి గురి అయ్యి మరణించడం జరుగుతుంది.
అందువలన శక్తివంతమైన తాంత్రిక విద్యలను అభ్యసించడం వలన మనుషులు తాము ఎదుర్కొంటున్న శత్రువులు చేసే అభిచార కర్మలను నిర్మూలించుకోగలరు.
నష్ట స్త్రీ అనుబంధ ప్రాప్తి, నష్ట స్త్రీ సాంగత్య ప్రాప్తి, నష్ట ద్రవ్య ప్రాప్తి కార్యసిద్ధిని పొందగలరు. ఈ తాంత్రిక విద్యలను ఉపయోగించే విధానాలను, మంత్రాలను నాకు లభించిన ప్రాచీన తాళపత్రముల ద్వారా అందజేస్తాను.
వీటిని అభ్యసించి మీ సమస్యలకి మీరే పరిష్కార మార్గములను చేసుకోవచ్చని ఆశిస్తున్నాను. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఏ స్థాయిలో ఉన్నవ్యక్తికి ఆ స్థాయిలో శత్రుపీడ ఉంటుంది.
ప్రత్యంగిరా కృత్యా తంత్రం
అందరికీ ఆర్థిక వెసులుబాటు ఉండదు. మీ యొక్క శత్రు సంహారం చేయగలిగే తంత్ర వేత్తలను ధనరూపములో తృప్తిపరచే ఆర్థిక శక్తి ఉండదు కనుక మీ యొక్క సంకల్పమే మీ ఆయుధం.
ఈ తంత్ర మార్గాలను ఆర్థిక బలము, అంగ బలం లేనివారు కూడా అభ్యసించి ఉపయోగించి మేలును పొందగలరు.
జీవుడు తాను పుట్టిన దగ్గర్నుండి మరణించే వరకు తన యొక్క పూర్వజన్మ లోని చేసుకున్న పాపపుణ్యాల కర్మఫలాన్ని అనుభవించడానికి విధి రూపములో ఎన్నో
ఎన్నెన్నో అనుభంధాలను, ఆనందాలను, ఐశ్వర్యాలను, ప్రేమానుబంధాలను, భాద్యతలను, సుఖాలను అనుభవించడం జరుగుతుంది. పూర్వజన్మలో ఎవరితోనైతే శత్రుత్వము కలిగి ఉంటారో,
ఈ జన్మలో వారికి బాంధవ్యాల రూపములో సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. పూర్వజన్మలో తాము ఎదుర్కొన్న అనారోగ్య, ఆర్థిక,సామాజిక, కుటుంబ, బంధుత్వాల ఋణ శేషం ఇహ జన్మలో మానవుడు అనుభవిస్తున్నాడు.
ఆ పూర్వజన్మ తాలూకు ఋణశేషం, శత్రు శేషం, ఆయుర్భావ శేషం, ఇహ జన్మలో గ్రహాల ద్వారా యోగా, అవయోగాల ద్వారా వాటిని అనుభవించి కర్మఫలాన్ని సంపూర్ణం చేయటం జరుగుతుంది.
ఇది శాస్త్ర సమ్మతం. అయితే ఈ జన్మలో ఎదుర్కొంటున్న, ఎదుర్కొబోయే సమస్యలు, దోషాలు వేద జ్యోతిష్య శాస్త్రము ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము.
Pratyangira Krutya Tantram
ప్రత్యంగిరా కృత్యా తంత్రం
కర్మఫలాన్ని అనుభవించడానికి మనం పుట్టినపుడు ఈ కర్మఫలములో ఉండే అతి భయంకరమైన మానసిక, శారీరక క్షోభకు గురి చేసే విధి వ్రాతను తప్పించుకోవటం ఎంతవరకు సాధ్యం?
అని ప్రతి ఒక్కరకి సందేహం కలుగక మానదు. విధి అనేది తప్పక అనుభవించాల్సిందని దాని నుండి తప్పించుకోవడం సాధ్యం కాదని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.
పురాణాల ప్రకారంగా చూసినట్లైతే గంధర్వులు, యక్షులు, శాపాలకు గురి కావడం జరిగింది. శాపాలకు గురి కావడం అనేది విధి. శాపాలకు విమోచన, విరుగుడు చేసుకోవడం అనేది ఆత్మ సంకల్ప విధి.
పూర్వజన్మ కర్మఫలం శరీర రూపములో ఆత్మ అనుభవించడం జరుగుతుంది. శరీరము రూపములో ఉన్న ఆత్మ పాపపుణ్యాలను అనుభవించడం వలన స్థూలశరీరమునకు మాత్రమే ఆ నొప్పి, ఆనందం తెలుస్తాయి.
అంతేగానీ శాశ్వతమైన ఆత్మకు కాదు. ఆత్మ అనేది శరీరములో ఉండే సూక్ష్మ రూపములో ఉండే ఆలోచనల రూపం.
కర్మ ఫలం వలన గాని, మానసిక దౌర్బల్యం వలన గాని, సమస్యలను ఎదుర్కొంటున్న శరీరమునకు ఉపశమనం ఇచ్చే మార్గాలే అంతరాత్మ ద్వారా మనకు భగవంతుడు తెలియజేస్తాడు.
ఆ భగవంతుడు ఇచ్చిన తాంత్రిక మార్గములే ఈ తంత్ర విద్యలు. కర్మఫలాన్ని అనుభవించడానికి మనపై భగవంతుడు ఏర్పరిచిన ఈ మాయా బంధాల సమస్యలను ఎదుర్కోవటానికి ఆ పరమాత్మే మార్గాలను చూపించాడు.
మానవ రూపములో ఉన్న పాండవులను, వారి కర్మ ఫలమును అనుభవించేట్టుగా చేస్తూ మరొకపక్క అతి ఘోర కృత్యాలకు పాల్పడే వారి నుండి బయట పడేందుకు శత్రు నాశనం చేసేందుకు శ్రీ కృష్ణ పరమాత్మ సైతం తంత్ర విద్యాలలోని శస్త్ర.
అస్త్రములను ఆ మానవ రూపములో ఉన్న పాండవుల చేతనే ప్రయోగింపజేసి శత్రు సంహారం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించాడు.
మహాభారతములో శత్రువులను సంహరించడం కోసం శ్రీ కృష్ణుడు అర్జునుని చేత ప్రయోగింపబడ్డ శస్త్ర అస్త్రాలు తంత్రములే కదా!!!
గ్రహాల రూపములో, గ్రహాల ద్వారా ప్రయోగింపబడ్డ అత్యంత శక్తివంతమైన నాగాస్త్రం, దీనినే వశీకరణాస్త్రం అంటారు. ఈ వశీకరణ అస్త్రం శుక్రుడు, రాహు గ్రహముల సహాయముతో ప్రయోగిస్తారు.
గ్రహముల ద్వారా మంత్రములను ప్రయోగించేవాటిని అస్త్రాలు అంటారు. తంత్రవిద్యలను అభ్యసించి ఉపయోగించి ప్రయోగించడాన్ని తంత్రం అంటారు.