Pothana Andhra Maha Bhagavatam in Telugu – Set of 2 Parts code 2038&2039

పోతన భాగవతము
– గీతాప్రెస్ గోరఖ్ పూర్
Set of 2 Parts

PAGES: 1888, (24 COLOR ILLUSTRATIONS)
COVER: Cloth binding
OTHER DETAILS: 11.0 INCH X 7.5 INCH
WEIGHT OF THE BOOK: 3.1 KG

700.00

+ Rs.100/- For Handling and Shipping Charges
Share Now

Description

Potana Bhagavatam in Telugu (Set of 2 Parts)
– Gita Press Gorakhpur Books | code 2038 | code 2039

పోతన భాగవతము
– గీతాప్రెస్ గోరఖ్ పూర్

 

Potana Andhra Maha Bhagavatam in Telugu – Set of 2 Parts

భగవంతుడికి సంబంధించిన పుణ్యకథల సమాహారం భాగవతం. భగవంతుడు అంటే ఎన్నటికీ తరిగిపోని సమస్త ఐశ్వర్యాలు కలవాడని, మహాబలవంతుడని, అపార కీర్తిమంతుడని, సకల సంపదలకు నెలవైనవాడని, అనంత జ్ఞానసంపన్నుడని, ఏ రాగద్వేషాలూ లేనివాడని నిఘంటువులు చెబుతున్నాయి. అలాంటి భగవంతుడైన కృష్ణుడి లీలలను తెలిపేది భాగవతం. భాగవతం వేదవృక్షానికి కాసిన ఫలం. అది వైకుంఠంలో ఉండగా, నారద మహర్షి ఆ అమృత ఫలాన్ని తెచ్చి నాకు ఇచ్చాడు. నేను ఆ ఫలాన్ని నా కొడుకైన శుకుడికి ఇచ్చాను. శుకుడు తన శిష్యప్రశిష్యులకు బోధించి, లోకానికి పంచిపెట్టాడు. పరీక్షిత్తుకు ప్రబోధించాడు అని వేదవ్యాస మహర్షి భాగవత ప్రారంభంలో అన్నాడు.

భాగవతం ఏం చెబుతోంది, భాగవతంలో ఏముంది? అనే ప్రశ్నలు అందరిలోనూ ఉత్పన్న మవుతాయి. వేదవ్యాసుడు భాగవత పరమార్థాన్ని విపులంగా విప్పి చెప్పాడు. భాగవతంలో ఎలాంటి కపటంలేని ఉత్తమ ధర్మం ఉందని అన్నాడు. మనిషి తన జన్మ సార్థకత కోసం చేసే పనుల్లో కర్మ, భక్తి, జ్ఞానాలు అంతర్భవిస్తాయి. కర్మవల్ల కలిగే ఫలం, భక్తి వల్ల కలిగే ఫలం, జ్ఞానం వల్ల కలిగే ఫలం మనిషిని సంసార చక్రంలో బంధించివేస్తాయి. ఈ మూడింటి ఫలాలను అనుభ విస్తున్నంత కాలం బాధలు తప్పవు. కనుక ఈ బాధలన్నింటికీ అతీతంగా కేవలం ఈశ్వరారాధనమే ఉంటే ఏ రాగద్వేషాలూ అంటుకోవు. అలాంటి ధార్మిక కథలకు భాగవతం నిలయం!

భాగవత తత్త్వాన్ని తెలుసు కోవాలంటే మొదట మాత్సర్యాన్ని వదలిపెట్టాలి. మాత్సర్యం అంటే ఇతరుల గొప్పతనాన్ని, అభివృద్ధిని ఓర్వలేకపోవడం. ఇది ఉంటే భాగవతం అర్థం కాదు. మాత్సర్యం అనే దుర్గుణం లేకుంటే మనిషి సర్వభూతదయాళువు అవుతాడు. అలాంటి గొప్ప మనసు ఉన్నవారికే భాగవతం బోధపడుతుంది. భాగవతం మనిషి తాపత్రయాలను పోగొడుతుంది. మూడు తాపాలవల్ల కలిగే భయాలను ఆందోళనలను తొలగింపజేసేది భాగవతం. పరీక్షిత్తు వృత్తాంతమే అందుకు నిదర్శనం. అతడికి మృత్యుభయం లేకుండా చేసి, ముక్తిని ప్రసాదించింది భాగవతం.

భాగవతంలోని ఇతివృత్తం శాశ్వతానందాన్ని, సుఖాన్ని ప్రసాదిస్తుంది. సుఖాలు రెండు విధాలు. అశాశ్వత సుఖం, శాశ్వత సుఖం అని. లోకంలో మనిషికి లభించే సంపదలన్నీ అశాశ్వతాలు. వాటివల్ల కలుగుతున్న సుఖమూ అశాశ్వతమే. మధుర పదార్థాలు రుచికరంగానే ఉన్నా అతిగా తింటే రోగాలు సంభవిస్తాయి. ఆహార, విహారాలు, భౌతిక సుఖాలు, శారీరక సుఖాలు కొంతకాలం వరకే మురిపిస్తాయి. వృద్ధాప్యంలో శత్రువులై పట్టిపీడిస్తాయి. ఇలాంటి బాధాకరమైన సుఖాల వెంటపడరాదని చెబుతుంది భాగవతం. శాశ్వత సుఖం అంటే భగవంతుడి అనంత గుణగణాలను తెలుసుకోవడం. ఏది నిత్యమో, ఏది సత్యమో అర్థం చేసుకోవడం. అలాంటి శాశ్వత సత్యాలను ఆవిష్కరించేది భాగవతం. భాగవతాన్ని చదవాలనే కాంక్ష కలిగిందంటే అది పుణ్యఫలమే. భాగవతాన్ని వినాలనే ఆసక్తి కలిగిందంటే అది సుకృతమే. అలాంటి కోరిక మనసులో కలిగితే చాలు- భగవంతుడు హృదయంలో స్థిరంగా ఉంటాడు.

వ్యాసుడివంటి సర్వ భూత హృదయుడైన దయాశాలికి మనశ్శాంతిని అందించిన భాగవతం మానవాళికి లభించిన అపూర్వఫలం! దాన్ని ఆస్వాదించి, శాశ్వతానందాన్ని సొంతం చేసుకోవడం మనిషి కర్తవ్యం!

– డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ