Description
Nakshatra Yogadanam
నక్షత్ర యోగదానం
మనిషి పుట్టిన మొదలు చనిపోయే వరకు ప్రాథమికంగా తెలుసుకోదగినది ‘జన్మ నక్షత్రం’ . జన్మనక్షత్రం తెలిస్తే ‘జన్మరాశి’ తెలుస్తుంది. ఆ జన్మరాశి తెలిస్తే జాతక కుండలిలో నవగ్రహాలు ఏఏ స్థానములో ఉన్నాయో, ఆ నవగ్రహాల
బలాలు ,బలహీనతలు వగైరా విషయాలు తెలుస్తాయి. అందుకే నక్షత్రాలకు పంచాంగములో ఒక ప్రత్యేక స్థానం కల్పించారు.
ప్రస్తుత కాలమాన పరిస్థితులలో జ్యోతిష విజ్ఞానము బాగా పెరిగింది. జ్యోతిష శాస్త్ర జ్ఞానము ఎరుగనివారంటూ ఎవరూ లేరు. ఒక వ్యక్తి జీవితంలో శుభాశుభాలను తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా తెలుసుకోవలసింది నక్షత్రమే. ఆ నక్షత్రం తెలుసుకుంటే దైవజ్ఞుని సలహా మేరకు జీవన గమన శైలిలో మార్పును తెలుసుకోవచ్చు. మనిషి తన శరీరము ఈ భూమి నుంచి నిష్క్రమించేలోగానే ఏదో రూపములో దాన ధర్మాలు చేస్తూనే ఉంటాడు. ఆ మనిషి చేసే దాన ధర్మాలు అతని కర్మావశేషాన్ని తగ్గించి ఉన్నత మార్గములో నడిపిస్తాయి. అయితే ఆ మనిషి ఏఏ నక్షత్రాలో ఏఏ దాన ధర్మాు చేయాలో ఆ వ్యక్తికి తెలిసి ఉండాలి. అలా తెలియవలసిన విషయాలకు కూడా సప్రమాణత ఉండాలి. అటువంటి సప్రమాణత
కలిగిన విషయాలను ఈ ‘నక్షత్ర యోగ దానము’ ద్వారా సర్వము విపులముగా విశదముగా ప్రతి వారికి అర్థమయ్యే విధముగా వివరించుట జరిగింది. ఈ ‘నక్షత్రయోగదానము’ నారదమహర్షి శ్రీ కృష్ణ పరమాత్మ తల్లియైన దేవకీ మాతకు
తెలియజేశారు.ఈ విషయాన్ని భీష్ముడు ధర్మరాజుకు తెలిపారు.
ఇటువంటి సప్రమాణత కలిగిన ఈ నక్షత్రయోగదానమును
చదవండి ! ఆచరించండి ! ఆశీర్వదించండి !!
శ్రీపాద శ్రీవ్లభ చరణదాసుడు
మానికొండ రాజశేఖర్ శర్మ
విద్యా ఆధ్యాత్మిక వేత్త
వాస్తు జ్యోతిష నిపుణులు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా.