Naku Tochina Mata

నాకు తోచిన మాట

     videos 

100.00

మరిన్ని Telugu Books కై
Share Now

Description

Tadepalli Raghva narayana sastry
naku tochina mata

తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రిగారు, చందోలు.
ఒకసారి శ్రీ రాయడు శాస్త్రిగారికి మాతండ్రిగారు వ్రాసిన రామకథామృతమును వినిపించుట జరిగినది. అపుడు, రాయడు శాస్త్రిగారు – మీ రామరావణులకు భేదమేమి? అని నన్ను ప్రశ్నించిరి. అపుడు నేను మా రాముడు అటు ఇటు కానివాడు. కాని రావణుడు మాత్రము మూలమునందలి వాడేనని అంటిని. ఏలన సామాన్యముగ లోకమున రావణుడు పదితలలు, ఇరువది చేతులు కలిగియుండునను వాడుక ప్రబలమైయున్నది. రావణునకు దశగ్రీవుడని పేరుకదా! ఇట్లుండ సుందరకాండమున – సీతను వెదుకబోయిన హనుమంతుడు అంతఃపురమున నిద్రించు రావణుని చూచి – ”బాహూ” – అని (రెండు బాహువులు గలవాడని) వర్ణించినట్లు కలదు. ఇది వాల్మీకి ప్రయోగము. అనగా రావణుడు కామరూపుడు గాన వ్యవహారమున నట్లున్నను నిద్రయందు తన ప్రకృతి రూపముననున్నాడనియు, అదియే సత్యరూపమని యొప్పుకొనవలెననియు వారి యభిప్రాయము. ద్విత్వ విశిష్టజాతినిబట్టి ఈ ఒకచోటి ప్రయోగము లోకానుసారముగ సాధువుగ సమన్వయించుట సమంజసమని నేను చెప్పితిని. కామరూపులు రతియందు, నిద్రయందు, మృతియందు తమ స్వస్వరూపములతో నుందురని శాస్త్రము. ఈ రహస్యమెఱిగిన వ్యాస వాల్మీకులు యథాతథముగా వారివారి నాయకులను, పాత్రలను తీర్చిదిద్దిరి కాని సామాన్య కవులవలె కల్పనా భూయిష్టముగ రచింపలేదు. భారతమున యుధిష్ఠిరుడు – ”అశ్వత్థామా హతః కుంజరః” అన్న మాటను పాత్ర పోషణమునకుగా దీసివేయకుండ ఉన్నది యున్నట్లు వ్రాసెను. కాబట్టి సామాన్య కావ్యముల దృష్టిలో పై వ్యాస వాల్మీకుల కావ్యముల చేర్చరాదు. పై కవులు సృష్టించిన పాత్రలు మరే కావ్యమందున్నను, అందలి విషయమే ప్రామాణికమని భావించరాదు. అహల్యా సంక్రందనము, తారాశశాంకము, పారిజాతాపహరణము మొదలగు కావ్యములలో పౌరాణిక పాత్రలున్నవి. అందలి కవి వర్ణిత విషయమే ప్రమాణమని భావించరాదు. ముక్కుతిమ్మన సాక్షాత్తు శ్రీకృష్ణుడే కృష్ణదేవరాయలై సింహాసన మధిష్ఠించెనని- యాదవత్వమున సింహాసనస్థుడు గామి – అను పద్యమున వర్ణించినాడు. కృష్ణుని తర్వాత మఱొక యవతారము పురాణముల వర్ణితము కాదు. కవిత్వమున చమత్కారకారిత్వ మవసరము. ఆ ముక్కు తిమ్మనయే అస్తపర్వతమందు తిరుగు కామధేనువు పేడ వేయగా నది యెండి అందలి దావాగ్నితో తగులబడి చల్లారి గుండ్రముగా గన్పట్టుచున్న దని చంద్ర మండలమును వర్ణించెను. కావున కవులు కాలానుగుణముగ చేసిన కల్పనలన్నియు ప్రమాణములని భావింప నక్కరలేదు. మనకు వేదములు పరమప్రమాణములు. పిమ్మట ధర్మశాస్త్రములు, ఇతిహాసములు గ్రహింపదగినవి. ఇందు ధర్మములు భిన్నభిన్నములుగా నుండును. ఆయా దేశములబట్టి అవి మారుచుండును. శాస్త్రము – మేనమామ కూతురును వివాహమాడుట నిషేధించినది. కాని ఈ సంప్రదాయము ఆంధ్రులలోనున్నది. కావుననే – ”ఆంధ్రాణామయ మాచారః” అనవలసి వచ్చినది. శంకరులు భారతములో లేని ధర్మ మితర గ్రంథములలోనున్న దాని నాచరించినను విడిచినను ప్రత్యవాయము లేదనియు, భారతమందలి ధర్మము ఇతర గ్రంథములయందు లేకున్నను తప్పక యాచరింపవలెనని వాక్రుచ్చిరి. భారతమున సుభద్ర అర్జునునకు మేనమామ కూతురు. బలరాముడు వారి వివాహము అంగీకరింపలేదు. అపుడు శ్రీకృష్ణుడు బలరామునకు నచ్చచెప్పి వారి వివాహము జరిపించుట జరిగినది. ఈ విషయము వ్యాసుడు శ్రీకృష్ణుని ద్వారమున చెప్పించుట గమనింపదగినది కాని ఈ యాచారము ద్రవిడులలో లేదు. కాని కృష్ణుడు చెప్పిన దంతయు ప్రమాణమా? అనరాదు. కృష్ణుడు కూడ వేదచోదితమే చెప్పునుగాని వ్యతిరిక్తము చెప్పడు ”మాతుల స్యేవయోషా” అన్న మంత్ర లింగమునుబట్టియే శ్రీకృష్ణుడాధర్మమును జెప్పెనని గ్రహింపవలెను.