Mahavatar Babaji -Paramahamsa Pragnananda

మహావతార్ బాబాజీ

99.00

Out of stock

మీ ఈమెయిల్ ఇచ్చిన యెడల, పుస్తకము స్టాక్ వచ్చిన వెంటనే మీకు ఈమెయిల్ పంపగలము

Share Now

Description

బాబాజీ ఒక భారతీయ సన్యాసి. బాబాజీ అనే పేరు 1861, 1935 సంవత్సరాల మధ్య కాలంలో  ఆయనను కలిసిన లాహిరీ మహాశయులు మొదలైన వారు పెట్టిన పేరు. వీటిలో కొన్ని సమావేశాల గురించి, స్వీయ అనుభవం గురించి పరమహంస యోగానంద తన ఆత్మకథలో వివరించడం జరిగింది. అలాగే యుక్తేశ్వర్ గిరి రచించిన ది హోలీ సైన్స్ అనే పుస్తకంలో బాబా గురించిన ప్రస్తావన ఉంది.

జీవిత విశేషాలు

బాబాజీ అసలు పేరు గానీ ఆయన పుట్టిన తేదీ కానీ ఎవ్వరికీ ఇప్పటిదాకా తెలియదు. కాబట్టి ఆ సమయంలో ఆయనను కలిసిన వారంతా లాహిరీ మహాశయులు వాడిన బాబాజీ అనే పేరునే వాడటం జరిగింది. ఆయనను కలిసిన వారు తమలో తాము చర్చించుకోవడం ద్వారా తామంతా కలిసింది ఒకే వ్యక్తినేనని నిర్ణయించుకున్నారు.

స్వయంగా బాబాజీవారుక్రియా యోగ పద్ధతులను, శారీరక స్థితిని ఆరోగ్యముగా నిలుపు కొనుటకు ఉపయోగించిరి. మనకి అతి తక్కువగా తెలిసిన కాయకల్ప చికిత్స ద్వారా బాబాజీ వారు అనేకసార్లు నిత్య యౌవ్వనమును సాధించినట్లుగా, లాహిరి మహాశయుల శిష్యులైన ప్రణవానంద స్వామికి తెలిపియున్నారు. ఈ కాయకల్ప చికిత్సలో ఉపవాసము. సుదీర్ఘనిద్ర, ధ్యానము మూలికా ప్రయోగములు ఉన్నాయి.

మహావతార్ బాబాజీ వారు శిష్యుల యొక్క మనస్తత్వానికి, శక్తి సామర్థ్యములకు అనుగుణంగా సూచనలిచ్చుచూ సాధన అభివృద్ధి చెందునట్లు చేయుచు, సంసిద్ధులైన వారికి అంచెలంచెలుగా సాధన రహస్యములను తెలుపుదురు. అవతార పురుషులు అందరూ విశ్వనాటకములో అవసరమైనపుడు వారి వారి పాత్రలను పోషించెదరు. బాబాజీది శివును అవతారము. ప్రకృతి చేతనావస్థలో లీనమైన మానవునను చీకటి నుండి వెలుతురు లోకి తీసుకుని వెళ్ళుటకు, మానవత్వమునకు అధ్యాత్మిక విలువలను అందించుటకు, జీవితపు ఒత్తిడికి లోనై దారి తప్పిన మానవులకు సన్మార్గులుగా చేయుటకు, బాబాజీ వారు పూనుకొనిరి. కొన్ని విశ్వ సంబంధమైన, గ్రహ సంబంధమైన ప్రభావములను ప్రస్తుత కాల చక్రముతో అనుసంధించ వలసిన అవసమున్నా ఈ పనిని చేయుటకు కొంత మంది సద్గురువులు మాత్రమే భూమి మీదనుండి చేయగలరు. భగవంతుని కచ్చితమైన నియమములకు అనుగుణముగా ఈ వివ్య ప్రణాళికను అమలు చేసే బాధ్యత గురువులదే.

గత శతాబ్దమంతా కూడా బాబాజీ వారు ఉత్తర భారతదేశములోని హిమాలయ పర్వతముల బద్రినారాయణ, నేపాల్ సరిహద్దు మధ్యన గల పర్వత శ్రేణిలో ఉండిరి. ఈ ప్రాంతములోనే ద్రోణగిరి పర్వతము మీద బాబాజీ వారు లాహిరి మహాశయులకు క్రియా యోగ దీక్షను యిచ్చి ఆయనను స్వస్థలమునకు వెళ్ళి తన శిష్యులకు క్రియాయోగ రహస్యమును తెలుపవససినదిగా ఆజ్ఞాపించిరి. ఈ సంఘటన 1861 వ సంవత్సరంలో వసంత ఋతువులో జరిగింది. బాబాజీతో కలసి ఉన్న ఈ కొద్ది సమయములో లాహిరి మహాశయులు అనేక అద్భుతములను చూసిరి. మహావతార్ బాబాజీ గారి ప్రియశిష్యులను చాలామందిని కలుసుకొనిరి.

గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణీ సంగమమయిన అలహాబాద్ లో కుంభమేళాలో మహాముని బాబాజీ శ్రీ యుక్తేశ్వర మహారాజ్ ని కలిసి సర్వమతముల ఐక్యతకు ఆధారమైన గ్రంథమును వ్రాయమని చెప్పిరి. పవిత్రమైన శాస్త్ర నిరూపణలతో శ్రీ యుక్తేశ్వర మహారాజ్ గారు గ్రంథమును రచించిరి. యోగిరాజు లాహిరి మహాశయుల సన్నిహితుడాఇన శిష్యులు అనేక మందికి బాబాజీతో స్వయంగా సంబంధములు ఉండెడిది. ఆ సంబంధము అనేక సంవత్సరముల పాటు హిమాలయములలో బాబాజీ గారితో గాని, వారి దివ్యదర్శనంతో గాని ఉంటూండెడిది.