Mithuna Lagnam

Author: Pucha Srinivasa Rao

Pages: 164

99.00

Share Now

Description

Mithuna Lagnam Book

మిథున లగ్నం

Author: Pucha Srinivasa Rao

Pages: 160

  ద్వాదశ రాశులను గురించి లేదా ద్వాదశ లగ్నాల గురించి భారతీయ భావనలు ఎలా ఉన్నాయి. పాశ్చాత్యుల ఉద్దేశాలు ఎలా ఉన్నాయో తెలియజేసే రచనలు తెలుగులో లేవనే చెప్పవచ్చును. రాశీ ఫలితాలు, పరిహారాలను గురించి తెలియజేసే పుస్తకాలున్నా ఖగోళం ఆ రాశీ స్వరూపం ఏమిటి, పాశ్చాత్యులు భావనలు ఎలా ఉన్నాయి వారు ఈ లక్షణాలను ఎలా విశ్లేషించారు అనే విషయాలు మనకు పెద్దగా తెలియవనే చెప్పాలి. దీనిని దృష్టిలో పెట్టుకొని అందరికి ఉపయోగపడేలా అంటే ఆయా లగ్నాలవారికి, ఆయారాశులు చంద్రదాశులవారికి, సౌరమానం ప్రకారం ఫలితాలు సరిపోయేలా ఈ రచనను ప్రణాళిక చేయబడి ఈ నాటికి మీ చేతులలోకి వచ్చింది.
    రాశీ చక్రంలో మూడవరాశిగా చెప్పుకొనేది మిథునం. వృషభరాశి పూర్తయిన తరువాత 30 డిగ్రీల వరకు అవధి కలిగి అంటే 60 – 90 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్న రాశి. ఈ రాశిలో మృగశిర 2, ఆర్ద్ర, పునర్వసు 3 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం జూన్15 – జూలై 16 మధ్యలో పుట్టిన వారు మిథునరాశి జాతకులుగా చెప్పబడ్డారు.
మీరు మిథున లగ్నం, మిథునరాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు
1. ఆకర్షణీయమైన వ్యక్తిత్వము,
2. ఒకేసారి అనేక పనులు చేపట్టగలిగే నేర్పు,
3. తమ భావాలను చక్కగా చెప్పగలిగే నేర్పు,
4. స్థిరత్వము విశ్రాంతి లేకపోవడం,
5. ఒక్కోసారి కఠినులుగా మారిపోతే,
6. సరదాగా ఉండేవారు, హాస్యప్రియులైతే,
7. భిన్నమైన మానసిక స్థితి (హృదయానికి, ఆలోచనలకు పొంతన లేకపోతే)
8. ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకోగలిగిన వారైతే,
9. అనేకమంది మిత్రులున్నా అంతరంగిక మిత్రులు కొందరే అయితే,
10. పూర్తిగా ఆధారపడదగినవారనే పేరు (నమ్మకమైన వారు).
మీరు తప్పకుండా మిథున రాశివారే … ఇక పుస్తకం చదవండి….