Vruchika Lagnam

వృశ్చిక లగ్నం
Author: Pucha Srinivasa Rao
Pages: 160

99.00

Share Now

Description

Vruchika Lagnam Book

Author: Pucha Srinivasa Rao
Pages: 160
ద్వాదశ రాశులను గురించి లేదా ద్వాదశ లగ్నాల గురించి భారతీయ భావనలు ఎలా ఉన్నాయి. పాశ్చాత్యుల ఉద్దేశాలు ఎలా ఉన్నాయో తెలియజేసే రచనలు తెలుగులో లేవనే చెప్పవచ్చును. రాశీ ఫలితాలు, పరిహారాలను గురించి తెలియజేసే పుస్తకాలున్నా ఖగోళం ఆ రాశీ స్వరూపం ఏమిటి, పాశ్చాత్యులు భావనలు ఎలా ఉన్నాయి వారు ఈ లక్షణాలను ఎలా విశ్లేషించారు అనే విషయాలు మనకు పెద్దగా తెలియవనే చెప్పాలి. దీనిని దృష్టిలో పెట్టుకొని అందరికి ఉపయోగపడేలా అంటే ఆయా లగ్నాలవారికి, ఆయారాశులు చంద్రదాశులవారికి, సౌరమానం ప్రకారం ఫలితాలు సరిపోయేలా ఈ రచనను ప్రణాళిక చేయబడి ఈ నాటికి మీ చేతులలోకి వచ్చింది.
రాశీ చక్రంలో ఎనిమిదవరాశిగా చెప్పుకొనేది వృశ్చికరాశి. తులారాశి పూర్తయిన తరువాత 30 డిగ్రీల వరకు అవధి కలిగి అంటే 210 – 240 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్న రాశి. విశాఖ 1, అనూరాధ 4, జ్యేష్ఠ 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం నవంబర్ 17 – డిసెంబర్ 15 మధ్యలో పుట్టిన వారిని వృశ్చికరాశి జాతకులుగా చెప్పబడ్డారు.
మీరు వృశ్చికలగ్నం, వృశ్చికరాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు
1. లోతుగా ఆలోచించే వారైతే,
2. మీ అసంతృప్తిని బయటకు వ్యక్తం చేసేవారైతే,
3. భయం లేనివారైతే
4. ఆకర్షణీయమైన రూపం కలిగినవారైతే
5. కటువుగా మాట్లాడడానికి సందేహించని వారైతే
6. నమ్మదగినవారని పేరుంటే
7. విశేషమైన శక్తియుక్తులు కలిగినవారైతే
8. పైకి ఒకటి లోపల ఒకటి ఆలోచించేవారైతే
9. అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించేవారైతే
10. ఎవరితోనూ అనుబంధం పెంచుకోని వారైతే
మీరు తప్పకుండా వృశ్చికరాశివారే … ఇక పుస్తకం చదవండి….