Description
Meere Numerologist Book
మీరే న్యూమరాలజిస్టు
Author: MD Dawood
Pages: 440
శ్రీ మహమ్మద్ దావూద్, బాపట్ల, గుంటూరు జిల్లాకు చెందినవారు. వృత్తిరీత్యా హైదరాబదులో స్థిరపడి, న్యూమరాలజీని ప్రవృత్తిగా చేసుకొని, ఎందరికో న్యూమరాలజీ పరంగా అపారమైన సేవ చేస్తున్నారు.
చీరాలలో M.Com వరకు చదువుకుకొని, 1983లో రైల్వేలో కేంద్రప్రభుత్వ ఉద్యోగిగా చేరారు. 1999లో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. M.A. (జ్యోతిషం)లో ఉత్తీర్ణులయ్యారు.
ప్రస్తుతం M.Sc (సైకాలజీ) చేస్తున్నారు. ఈ విధంగా శ్రీ మహమ్మద్ దావూద్ ఉన్నత విద్యాభ్యాసం చేసిన వ్యక్తి. భృగు నాడీ జ్యోతిష విధానం శ్రీ AV Sundaram గారి వద్ద నేర్చుకున్నారు. 2006లో “జ్యోతిష విద్వాన్”, 2008లో “జ్యోతిష రత్న” బిరుదులు పొందారు.
చిన్నతనం నుండీ, న్యూమరాలజీ, జ్యోతిషశాస్త్రాలపై మక్కువ కలిగి, వాటిని అభ్యసించి, అధ్యయనం, పరిశోధన చేసి చేతి వ్రాత, సంతకాల విశ్లేషణపై పట్టు సాధించారు.
వీరి రచనలు అనేక ఆంగ్ల, తెలుగు పత్రికలలో ప్రచురితమయ్యాయి – ఇంకా అవుతున్నాయి. పలు టి.వి. ఛానెల్స్‌లో కూడా న్యూమరాలజీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా మీడియా మాధ్యమం ద్వారా న్యూమరాలజీ పై ప్రజలలో అవగాహనా కార్యక్రమాలు శ్రీ మహమ్మద్ దావూద్ నిర్వహించారు.
న్యూమరాలజీలో ముఖ్యంగా ఆధునిక సంఖ్యాశాస్త్రంలో ప్రిడిక్టివ్ పద్ధతులు, ఆస్ట్రోన్యూమరాలజీ మొదలైన వినూత్నమైన పద్ధతులలో శ్రీ మహమ్మద్ దావూద్ నిష్ణాతులు.
వీటిపై రాష్ట్రం నలుమూలలా పర్యటించి అవగాహనా సదస్సులు మరియు తరగతులు నిర్వహించారు. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, గ్రాఫాలజీ మూడింటిని అనుసంధానం చేస్తూ సమస్యలకు పరిష్కారం చెప్పటంలో శ్రీ మహమ్మద్ దావూద్ ఆద్యులు.
శ్రీ మహమ్మద్ దావూద్ తనలో ఉన్న పరిజ్ఞానం, అనుభవం క్రోడీకరించి తెలుగు పాఠకుల ప్రయోజనార్థం ఈ గ్రంథం మీ ముందుకు తీసుకురావటం జరిగింది.
పాఠకులు దీనిని చదివి ఆకళింపు చేసుకొని ప్రయోజనం పొందుతారని మహమ్మద్ దావూద్ గారి ప్రగాఢ విశ్వాసం. ఈ గ్రంథం చదివి పాఠకులు తమ అమూల్యమైన సలహాలు, సూచనలు తెలియజేయగలరని ప్రార్థన.