Description
Meena Lagnam Book
Author: Pucha Srinivasa Rao
Pages: 158
ద్వాదశ రాశులను గురించి లేదా ద్వాదశ లగ్నాల గురించి భారతీయ భావనలు ఎలా ఉన్నాయి. పాశ్చాత్యుల ఉద్దేశాలు ఎలా ఉన్నాయో తెలియజేసే రచనలు తెలుగులో లేవనే చెప్పవచ్చును.
రాశీ ఫలితాలు, పరిహారాలను గురించి తెలియజేసే పుస్తకాలున్నా ఖగోళం ఆ రాశీ స్వరూపం ఏమిటి, పాశ్చాత్యులు భావనలు ఎలా ఉన్నాయి వారు ఈ లక్షణాలను ఎలా విశ్లేషించారు అనే విషయాలు మనకు పెద్దగా తెలియవనే చెప్పాలి.
దీనిని దృష్టిలో పెట్టుకొని అందరికి ఉపయోగపడేలా అంటే ఆయా లగ్నాలవారికి, ఆయారాశులు చంద్రదాశులవారికి, సౌరమానం ప్రకారం ఫలితాలు సరిపోయేలా ఈ రచనను ప్రణాళిక చేయబడి ఈ నాటికి మీ చేతులలోకి వచ్చింది.
రాశీ చక్రంలో పన్నెండవ మరియు చివరిరాశిగా చెప్పుకొనేది కుంభరాశి. కుంభరాశి పూర్తయిన తరువాత 30 డిగ్రీల వరకు అవధి కలిగి అంటే 330 – 360 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్న రాశి.
పూర్వాభాధ్ర 1, ఉత్తరాభాధ్ర 4, రేవతి 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం మార్చి 15 – ఏప్రియల్ 13 మధ్యలో పుట్టిన వారిని కుంభరాశి జాతకులుగా చెప్పబడ్డారు.
మీరు మీన లగ్నం, మీన రాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు
1. మీరు మితిమీరిన భావోద్వేగాలు కలిగినవారైతే,
2. మీరు అసంబద్ధ నిర్ణయాలు తీసుకొనేవారయితే,
3. మీరు పలాయనవాదులయితే,
4. మీరు ఆదర్శంగా ఉండాలనుకొనేవారైతే,
5. మీరు ఒక్కొక్కసారి అతివిశ్వాసం ప్రదర్శించేవారైతే,
6. మీరు పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయేవారయితే,
7. మీరు బద్ధకస్తులయితే,
8. మీరు మంచి ఆలోచనలు కలిగినవారయితే
9. మీరు నిజాయితీపరులయితే,
10. మీరు పైకి ఒకటి లోపల ఒకటి ఆలోచించేవారయితే
మీరు తప్పకుండా మీనరాశివారే … ఇక పుస్తకం చదవండి….
– ప్రచురణకర్తలు