Mantra Sastram

మంత్ర శాస్త్రం
– డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్

450.00

Online Payment ఆర్డర్స్ త్వరగా పంపగలము

Share Now

Description

Mantra Sastram Book

Adipudi Venkata Siva Sairam
డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్

మంత్ర శాస్త్రం 

తంత్ర శాస్త్రము శక్తి ఉపాసన శాస్త్రము. యొక్క ముఖ్య గమ్యము జీవబ్రహ్మైక్యం. ఉపనిషత్తులు సిద్ధంతమే ఇది.కాని ఉపనిషత్తులు ఎక్కువగా జ్ఞానమును ఆధారం చేసుకున్నవి.
శక్తిని ఆధారం చేసుకున్నవి తంత్ర శాస్త్రములు. ఆత్మ జ్ఞాన గ్రంథాలు రహస్య గ్రంథాలన్నారు పెద్దలు.కనుక తంత్ర శాస్త్రమును రహస్య భాషలో వ్రాసారు.ఈభాషను సంధ్యా భాష అంటారు.
సంధ్య వేళయందు చీకటి, వెలుగులు రెండున్నట్లు, సంధ్యా భాషకు రెండర్ధాలున్నవి.తెలిసిన వారు చదివితే ఒక అర్ధం, తెలియని వారు చదివితే వేరొక అర్ధం.
మహానిర్వాణ తంత్ర శాస్త్రమును పరమేశ్వరుడు పార్వతీదేవికి కైలాసంలో చెప్పాడు.అని కొందరు అంటారు.వేదములు స్త్రీ శూద్రులు వేదకర్మలను ఆదరించకూడదని బహిష్కించినవి.
దీనివల్ల కలియుగంలో స్త్రీ శూద్రులు తంత్ర శాస్త్రమును ఆశ్రయించినట్లు తెలుస్తున్నది.

Mantra Sastram Book తంత్రము -క్రాంతములు

తంత్ర శాస్త్రము సాధనా గ్రంథము. త్రంత్రమునకు ఉపాయము అని కూడా అర్ధమున్నది. దీని యందు ముఖ్య విషయములను వేదములనుండే తంత్ర శాస్త్రము తీసుకున్నది.ఆ తీసుకున్నదానిని విశదపరిచి వ్రాసింది. తను అనగా విస్తరించుట. తనువిస్తారే. త్ర అనగా తరింప జేయు జ్ఞానము.తరింపజేయు జ్ఞానమును విస్తరించి చెప్పినది తంత్ర శాస్త్రము.తంత్ర శాస్త్రములో శక్తి (స్త్రీ) ఆరాధ్యముఖ్యము. శ్రీ పోజ వేదములలో శ్రీసూక్తం మొదలైన వాటిలలో ఉంది. గాయత్రి కూడా స్త్రీయే.యజ్ఞములందు పశుబలులు, సోమపానములున్నవి. తంత్ర శాస్త్రములు దేశాచారములను అనుసరించి అనేక రూపాలుగా ఉన్నాయి. ఈసంప్రదాయములు కల ప్రాంతములను క్రాంతములందురు.వింధ్యకు ఉత్తరాన ఉన్న భూమిని రాధాక్రాంతమంటారు.ఇక్కడ కాశ్మీరి సంప్రదాయం ఉంది.తూర్పున ఉన్న ప్రాంతమును విష్ణు క్రాంతము అంటారు.ఇక్కడ గౌడ (వంగ) సంప్రదాయం ఉంది. దక్షిణ దేశమును అశ్వ క్రాంతమందురు. ఇక్కడ కేరళ సంప్రదాయం ఉంది.ఎవరి ఆచారవ్యవహారములను అనుసరించి ఆసాధనలు ప్రబలివి.వంగీయులు మత్స్య మాంస ప్రియులు-వీరు వాటిని విశేషముగా ఉపయోగించిరి.