Sri Chinnamasta Sadhana

శ్రీ ఛిన్నమస్తా సాధన

99.00

Share Now

Description

Sri Chinnamasta Sadhana

Author: Dr. Jayanti Chakravarthi
Pages: 112

సృష్టి స్థితిలయకారిణి అయిన అమ్మ శ్రీఆదిశక్తి. జగన్మాత ధరించిన అవతారాలు ఎన్నో ఉన్నట్టుగా వివిధ పురాణాలు పేర్కొంటున్నాయి. ఇలా జగన్మాత ధరించిన అన్ని రూపాల్లో “దశమహావిద్యలు” అనే పది రూపాలు ఎంతో విభిన్నమైనవిగా, విశిష్టమైనవిగా లోకంలో ప్రసిద్ధిపొందాయి. ఆ అవతాలు 10 అవి:

1. శ్రీ కాళీదేవి

2. శ్రీ తారాదేవి

3. శ్రీ షోడశి దేవి

4. శ్రీ భువనేశ్వరిదేవి

5. శ్రీ త్రిపురబైరవిదేవి

6. శ్రీ ఛిన్నమస్తాదేవి

7. శ్రీ ధూమవతీదేవి

8. శ్రీ బగళాముఖీదేవి

9. శ్రీ మాతంగీదేవి

10.శ్రీ కమలాత్మికాదేవి

ఇలా జగన్మాత దశమహావిద్యలు అనే పది అవతారాలుగా ఆవిర్భవించారు. ఏ ఏ దేవతలను ఆరాధించాలి అనుకునేవారు ఆ దేవతకు సంబంధించిన వివరాలను జయంతి చక్రవర్తి గారు వివరించారు. ఈ సంకలనంలో ఛిన్నమస్తా దేవి గురించి, వివిధ రకాలైన ఛిన్నమస్తా మంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతుల గురించి, శ్రీ ఛిన్నమస్తా అష్టోత్తర, సహస్త్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంధాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకలనంగా రూపొందించి మీకందించారు. శ్రీ ఛిన్నమస్తాదేవి సాధన జప – హోమవిధానం – స్తోత్రాలు – స్తుతులుతో సహా మీకు అందించారు. ఈ పుస్తకం చదివి దేవి కృపకు పాత్రులుకాగలరని కోరుకుంటున్నాం. – జయంతి చక్రవర్తి