Description
Anubhava Mantra Yantra Tantra Shiromani book in telugu
pages-296
అనుభవ మంత్ర యంత్ర తంత్ర శిరోమణి
Author : Bommakanti Venkata Subrahmanya Shastri
Pages : 296
ఇప్పుడు ప్రశ్నఏమిటంటే ఈ గ్రంథాన్ని ఉపయోగించుకోవడం ఎలా? ముందు మీరు ఈ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదవండి. మీరు ఎన్నుకున్న మంత్రాన్ని ఒకచోట వ్రాసుకోండి. గురువుగారి అనుమతితో ప్రారంభించ౦డి. లేదా గురువుగారు ఉపదేశించిన మంత్రాన్ని ప్రారంభించండి. మహామంత్ర ప్రకరణలో (3) మంత్ర సేకరణకు కాల నిర్ణయం అనే అధ్యాయం ఉంది దాని ప్రకారం దీక్ష తీసుకోండి. మంత్రజపానికి సరి అయిన ముహూర్తాన్ని ఎంచుకోండి. కాల ప్రకరణంలో సాధనకు చైత్రం, వైశాఖం, శ్రావణం, ఆశ్వీయుజం, కార్తీకం, మార్గశిరం, మాఘం, ఫాల్గుణం – 8 నెలలు మాత్రమే అనుకూలమని చెప్పబడింది. చైత్రంలో సుఖం, వైశాఖంలో ధనం, శ్రావణంలో అభివృద్ధి, కార్తీకంలో జ్ఞానం, ఆశ్వీయుజంలో సర్వాభీష్టాలు, మార్గశిరంలో శుభాలు, మాఘంలో బుద్ధివికాసం, ఫాల్గుణంలో సంపదలు కలుగుతాయని చెప్పబడింది. మీ కోరిక అవసరాన్ని బట్టి మాసాన్ని ఎన్నుకోండి. సాధనకు కృష్ణ, శుక్ల పక్షాలలో వచ్చే విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి ఈ పదకొండు మాత్రమే మంచివి. సోమ, బుధ, గురు, శుక్రవారాలలో ఏదో ఒకటి పై తిధులలో కలిసి వచ్చేట్టు చూచుకొండి. అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, ఉత్తరాషాడ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ పద్నాలుగు నక్షత్రాలలో ఏదో ఒకటి ఆరోజు ఉండేట్టు చూచుకొండి.