Aghora Gowri Pashupatam
– Sri Sripada Venkata Subrahmanyam
అఘోర గౌరీ పాశుపతం
₹300.00
Description
ఎంత అర్ధబలం, అంగబలం, సైనిక బలం ఉన్నా కొన్నిసార్లు విజయం అందకపోవచ్చును. కారణం దైవబలం లేకపోవడమే. దైవారాధనతోనే, తపస్సు చేతనే తనలో శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ భగవంతుని వరం ప్రాప్తమవుతుంది. తద్వారా విజయం అందుతుంది. పాండవులు అరణ్యవాసం చేయుచున్న సమయంలో వ్యాసమహర్షి పాండవులకు దైవబలం పొందడం ఆవశ్యం అని తలచి అర్జునుని శివుని కొరకు తపస్సు చేయమన్నాడు. అర్జునుని తపస్సుకు
మెచ్చిన మహాశివుడు వేటగాడిలా వేషం మార్చి అర్జునుని పరీక్షించదలచి, కొట్టిన పందిని కొట్టిన శివుడు అతగాడి మాటను, పనితనాన్ని, దీక్షను చూచి మెచ్చి పాశుపతాస్త్రాన్ని వరంగా ప్రసాదించాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రథసారథి శ్రీకృష్ణ పరమాత్మ, ఆయుధం శివుని అస్త్రం ఇంక అర్జునునకు విజయం దక్కక ఏమౌతుంది? పాండవులకు ఆవిధంగా విజయం దక్కడానికి ధర్మం వారి ప్రక్కన ఉండడమే కారణం. ధర్మమైన మార్గాన్ని ఆనుసరించినపుడు ఏ మంత్రమైనా, ఏ అస్త్రమైనా వినియోగము అవుతుంది. విజయం తమ పరం అవుతుంది. పాశుపత అస్త్రం ఎంత శక్తివంతమైనదో అలాగే ఈ పుస్తకంలో ఇవ్వబడిన ఆయా కార్యాల విజయాలకు సంపుటీకరించవలసిన మహామంత్రాలు అంత శక్తివంతమైనవి. రుద్రసూక్తము నమకము మరియు చమకములతో సంపుటీకరణ చేసి పారాయణ చేయుట లేదా శివాభిషేకము చేయుట ద్వారా ఆయా కామములు సత్వరమే విజయ మవుతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. రాకూడదు కూడా. కృషి లోపము ఉంచకండి. ప్రయత్నించండి సర్వకార్యముల యందు విజయం సాధించండి. సమస్త లోకాః శివమస్తు నిత్యం Aghora Gowri Pasupatham