Adhyatma Ramayanam in Telugu Books – Gita Press

ఆధ్యాత్మ రామాయణం

198.00

Share Now

Description

Adhyatma Ramayanam | code 845
ఆధ్యాత్మ రామాయణం ttd free pdf ….

సీతారాముల గుణగణాలు భారతీయుల హృదయాలలో ఎంత ప్రగాఢంగా హత్తుకొనిపోయినవంటె, ఆ మహనీయుల జీవితచరిత్రలు వర్ణించే రామాయణాలను ఎందరో, ఎన్నో రీతులలో రచించటం జరిగింది. ఉదాహరణకు: సంస్కృతంలో వాల్మీకి రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, వశిష్ఠ రామాయణం, ఆనంద రామాయణం, అగస్త్య రామాయణం మొదలైనవి; తెలుగులో మొల్ల రామాయణం, భాస్కర రామాయణం, రంగనాథరామాయణం మొదలైనవి. అలాగే తమిల, మళయాళ, హిందీ, బెంగాలీ భాషల్లోను అనేక రామాయణాలు వెలువడినవి. కాని యీ అన్ని రామాయణాలకు మూలం వాల్మీకి రామాయణమే. సంస్కృతంలో వాల్మీకి రామాయణాన్నే ఆదికావ్యంగా పరిగణిస్తున్నారు.

వాల్మీకి రామాయణానికి, అధ్యాత్మ రామాయణానికి ఉన్న వ్యత్యాసాలను ఒకమారు పరిశీలించటం అప్రస్తుతం కాబోదు. వాల్మీకి శ్రీరాముణ్ణి ఒక ఉదాత్త మానవుడిగానే చిత్రిస్తూ అతడి దివ్యత్వాన్ని నేపథ్యంలో ఉంచాడు. దానికి కారణం మనం సామాన్య వ్యక్తులం కనుక మనకు అలా ప్రవర్తించటం వీలుకాదనుకొంటారు. ఈ లోకంలో ఒక మానవుడు ఎలా ప్రవర్తించాలి అనే అంశాన్ని విపులీకరించటానికే వాల్మీకి రచన ఆ విధంగా సాగింది. శ్రీరాముణ్ణి మానవుడిగానే చిత్రించటంచేత అతడు ఆదర్శ పురుషుడైనాడు. అందుచేతనే జనసామాన్యానికి వాల్మీకి రామాయణమే ఆదర్శప్రాయంగా నిలిచి ఉంది.

కాని ముక్తిని ఆకాంక్షించే ముముక్షువులకు ఆధ్యాత్మ రామాయణమే పారాయణ గ్రంథమనటం సత్యదూరం కాబోదు. దీనిలో శ్రీరాముడు భగవంతుడి అవతారమని అడుగడుగునా తెల్పబడుతూన్నది. సీతాపహరణం యథార్థ సీతాపహరణం కాదనీ, మాయా సీతాపహరణమనీ; కైకేయీ మంధరలు కూడా దైవప్రేరణచేతనే ఆ విధంగా ప్రవర్తించటం జరిగిందనీ; రావణుడుకూడ శ్రీరాముడే పరమాత్మ అని ఎరిగీ శ్రీరామునిచే వధించబడి వైరభావంతో మోక్షం సముపార్జించటానికే సీతాపహరణ చేశాడనీ ఆధ్యాత్మ రామాయణం చెబుతోంది.

ఆధ్యాత్మ రామాయణంలో ఆత్మతత్త్వం అనేక సందర్బాలలో విపులంగా విశదీకరించబడివుంది. ప్రతి ముముక్షువుకు ప్రస్థానత్రయం ఎంత ముఖ్యమో యీ ఆధ్యాత్మ రామాయణమూ అంతే ప్రధానం అనటం అతిశయోక్తికాదు. శ్రీరాముడు దోషంలేని సచ్చరిత్రుడు, ద్వేషంలేని రాగమయుడు, రోషంలేని అమృతమయుడు.

ఆధ్యాత్మరామాయణం బ్రహ్మాండ పురాణాంతర్భాగం (61 వ అధ్యాయం). అన్ని పురాణాలు వేదవ్యాస విరచితాలే కనుక యీ ఆధ్యాత్మ రామాయణమూ వేదవ్యాస విరచితమనే ఒప్పుకొనటంలో దోషం లేదు. ఈ గ్రంథం భక్తిని పెంపొందించి, ముక్తిమార్గాన్ని చూపిస్తుంది. శ్రీరామ కృష్ణులు తరచు తన ఉపదేశాలలో ఆధ్యాత్మరామాయణాన్ని ప్రస్తావించేవారు: అలా ఆయన జనబాహుళ్యం యొక్క దృష్టిని యీ గ్రంథంయొక్క భక్తి ప్రాధాన్యత వైపు మళ్ళించారు.

అందరికీ అతిసులభంగా అర్థం అయ్యేలా సరళ వ్యావహారిక శైలిలో యీ తెలుగు అనువాదాన్ని చేశారు. ఈ గ్రంథం అశేష ఆంధ్ర పాఠకుల ఆదరాభిమానాన్ని చూరగొంటుందని మేం ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం.

Tags: 
TTD, Tirumala Tirupathi Devastanamulu