Description
జ్ఞానేశ్వరుడు (1275–1296) మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు, తత్వవేత్త, నాథ సంప్రదాయానికి చెందిన సన్యాసి. 21 సంవత్సరాల అతి తక్కువ జీవిత కాలంలోనే భగవద్గీత మీద ఆయన రచించిన జ్ఞానేశ్వరి, అమృతానుభవం అనే గ్రంథాలు మరాఠీ సాహిత్యంలో మైలురాళ్ళుగా పరిగణిస్తారు. దేవగిరి యాదవులచే పరిరక్షించబడిన ఈ గ్రంథాలు మరాఠీ భాషలో లభిస్తున్న అత్యంత ప్రాచీనమైన గ్రంథాలు.
ఇప్పటివరకు గీతకు వెలువడినన్ని వ్యాఖ్యానములు సాధారణముగా మరే కొద్ది గ్రంథములకో వెలువడియుండును. గీతకు గల వ్యాఖ్యానము లన్నింటియందును యీ జ్ఞానేశ్వరితో సాటివచ్చు వ్యాఖ్య మరొకటి యుండబోదు. ఏ ప్రత్యేక సాంప్రదాయమునకూ సమన్వయపరచి వ్యాఖ్యానింపకపోవుటే యిందలి ప్రత్యేకత. అన్నివిధములగు సాంప్రదాయములకు అతీతుడై యథార్ధమగు గీతా హృదయమును సుబోధక మొనర్చుటకు శ్రీజ్ఞానదేవులీ గ్రంథమున ప్రయత్నించిరి. ఇందలి ప్రత్యేకత యిందుగల వర్ణనావిధానము. ఏదైనా ఒక విషయమును గురించి చెప్పదలచినచో పాఠకులు ముగ్ధులగునటుల విశదీకరించి, స్పష్టముగా చెప్పబడియున్నది. ఎంతటి గంభీర విషయమైనను పెక్కు ఉపమానములతో సుబోధక మొనర్చబడి యున్నది. Gyaneshwari Bhagavad Gita, dnyaneshwari bhagavad gita,
Dnyaneshwari.