27 Nakshatralu – Jataka phalalu

27 నక్షత్రాలు – జాతక ఫలాలు

90.00

Share Now

Description

27 Nakshatralu – Jataka phalalu
27 నక్షత్రాలు – జాతక ఫలాలు

నక్షత్రాలు – రాసులు – గ్రహాలు – ఇవన్నీ మానవులతో సహా సకల జీవకోటిని ప్రభావితం చేస్తాయని మనకు తెలుసు. ముఖ్యంగా గ్రహాల యొక్క శుభాశుభ ఫలితాలు. మానవుల మీద అధికంగా కనిపిస్తుంటాయి. నక్షత్రాలు 27. జన్మించిన ప్రతి మనిషి ఏదో ఒక నక్షత్రజాతకుడై ఉంటాడు. జన్మ నక్షత్రాన్ని అనుసరించే రాసులు ఏర్పడుతుంటాయి. కాబట్టి నక్షత్రాన్ని అనుసరించి కూడా చాలా వరకూ జాతక ఫలితాలు, విశేషాలు తెలుసుకోవచ్చు. 27 నక్షత్ర జాతకుల యొక్క జాతక ఫలాన్ని అందించే ఉద్దేశంతో ఈ రచన సాగింది. జాతక ఫలితాలతో బాటు ముఖ్యమైన అనేక విషయాలు చెప్పడం జరిగింది. అలాగే పాదాక్షరాలతో వచ్చు పేర్లు కూడా చివర్లో ఇవ్వబడ్డాయి.

జన్మ నక్షత్రం తెలీని వారు – నామ నక్షత్రాన్ని బట్టి –  ఫలితాలు చూసుకోగలరు.

ఎవరికి వారే స్వయంగా తమ జన్మ లేదా నామ నక్షత్రాన్ని బట్టి ఫలితాలు చూసుకునే విధంగా ఈ పుస్తకం రూపొందించబడింది. కేవలం నక్షత్ర ఫలితాలే కాకుండా అనేక ఇతర విషయాలు ఇవ్వడం జరిగింది.  జాతకం సిద్ధాంతులకు చూపించక ముందే మీరే మీ చిట్టి పాపలు – చిన్నారి బాబుల జన్మ నక్షత్రాన్ని బట్టి చాలా వరకు భవిష్యత్తు సమాచారం తెలుసుకోడానికి ఇది ఎంతో ఉపకరిస్తుంది.

జ్యోతిష్య శాస్త్రం ఓ మహాసముద్రం. అందులోంచి ఒక దోసెడు మీకు అందిస్తున్నాము. ఆస్వాదించండి.27 Nakshtralu Jathaka Palamulu– నాగ భైరాగి