Description
Vijnana Bhairava Tantra Telugu
విజ్ఞాన భైరవ తంత్రం వేదాంతపరము మరియు లోతైన ముక్తిపరమైన కాశ్మీర శైవానికి సంబంధించిన ప్రాచీన గ్రంథం. దీనికి ఎక్కడా తెలుగు బాషలో మూలం కానీ భావం కానీ లభ్యం కావట్లేదు. ఇందులో స్వయంగా ఈశ్వరుడు పార్వతికి తంత్ర మార్గంలో ధ్యాన పద్ధతులను ఉపదేశం చేస్తాడు. పార్వతి భైరవుడిని అసలు నడవవలిసిన మార్గం ఏమిటి? భైరవ తత్త్వం ఏమిటి? అని ప్రశ్నిస్తుంది. అప్పుడు ఈశ్వరుడు భైరవ తత్త్వం ఆలోచనా పరిధికి అందేది కాదని వివరిస్తూ భైరవి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు నూట పన్నెండు విధాలైన ధ్యాన మార్గాలను వివరిస్తాడు. ఆ ధ్యానాల సమాహారమే ఈ విజ్ఞాన భైరవ తంత్రం. ఇందులో ధ్యానపద్ధతులన్నీ సంభవోపాయం (ఉన్నత జ్ఞానం కలిగినవారు పాటించతగిన పద్ధతి), శక్త్యోపాయం (కొంచెం జ్ఞానం కలిగినవారు పాటించతగిన పద్ధతి) మరియు ఆణవోపాయం (సామాన్య పద్ధతి)గా విభజించబడ్డాయి. సాధారణంగా శక్త్యోపాయం బాహ్య ప్రపంచంపై ఆధారపడేదిగాను, సంభవోపాయం పూర్తిగా అంతర్గతం మరియు నిరాధారంగానూ ఉంటాయి. కాశ్మీర శైవానికి మూలపురుషుడైనటువంటి అభినవగుప్తుడి ప్రకారం ఒక ఆధ్యాత్మికాభిలాషి తగినంత అవగాహన చేకూర్చుకుని సంభవోపాయాన్నే ఎంచుకోవాలి.
ఈ పుస్తకంలో తెలుగులో ఆ శ్లోకాలను మరియు సంక్షిప్తంగా వాటి భావాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాను. Vijna Bhairava Tantra