Description
వరాహమిహిర జాతక పద్ధతి
P .K . సుదర్శన్ & A . మహేశ్వరరావు
Pages : 302
Authors : P.K.Sudarshan and A.Umamaheswara Rao
ఈ ‘బృహత్ జాతకపద్ధతి’ అను గ్రంథము కేరళ దేశములో ప్రశస్తమైనది. 18 విధముల హోరాశాస్త్రములు 12 విధముల జాతకపద్ధతులున్నవని మా గురుదేవులు నాకు చెప్పియున్నారు. అందులో ఈ ‘బృహత్ జాతక పద్ధతి’ అవంతి (ఉజ్జయిని) దేశస్తు ఆదిత్య దాసుతనయుడు సాక్షాత్తు వరాహమిహిరాచార్యుల ప్రణీతమైనది. ఇతను క్రీ.శ. 7వ శతాబ్ధమువాడు. ఇతర గ్రంథముల క్రోడీకరణతో ఈ బృహత్ జాతకము తెలుపబడినది. ఇందు నవగ్రహములేగాక అప్రకాశ గ్రహములైన దూమాది పంచగ్రహములగూర్చి వివరముగా తెలుపబడినది. నవగ్రహముల పుత్రులైనకాలుడు, అర్థప్రహర, యమకంఠక, యామశుక్ర, మాంది గూర్చి వివరముగా తెలుపబడినది. పంచాంగ ఫలములతోపాటు దశాఫలవిశేషములు, భుక్తి విశేష ములు, అంతర్దశ, విదశా ఫలములు వివరముగా తెలుపబడినవి. పరాశర, గార్గి, యవన, పరమేశ్వర పద్ధతికూడా ఇందులో మిళితమై ఉన్నవి.
సాక్షాత్తు వరాహమిహిర ప్రణీతమైన బృహత్ జాతకమునకు భట్టోత్పల ఆచార్యునిచే ధశాధ్యాయి అను వ్యాఖ్యానము వ్రాయబడినది. ఈ దశాధ్యాయి చదివి అర్థము చేసుకొనలేని వారు బృహత్ జాతకమునకు వ్యాఖ్యానము వ్రాయుటకు చాల ప్రయాసపడవలయును. జ్యోతిషశాస్త్రమునకు వ్యాఖ్యానము వ్రాయుటకు సంస్కృత పరిజ్ఞానము మాత్రమే చాలదు. జ్యోతిషశాస్త్ర పరిజ్ఞానము కూడా అవసరము. ఈ ప్రశ్నమార్గ గ్రంథమునందు ఆచార్యుడు అధికభాగం బృహత్‌జాతకమును అనుసరించి వ్రాసినారు. ఇందులో ఉన్న విషయములన్నియు ఎక్కువగా బృహత్ జాతకమునుండి స్వీకరించినదే. జ్యోతిష పండితులకు పూర్తి జ్ఞానము, గుణము కలగాలనెడి అభిప్రాయముతో అందుకొరకు ప్రజలందరికి ఉపయుక్తము అగుటకు ఈ గ్రంథము తెలుగు అనువాదము చేయుచున్నాను. ఈ శాస్త్ర వ్యాఖ్యానము చదివి అర్థము చేసుకున్న యెడల సర్వ సందేహములు తీరును.
– P.K.సుదర్శన్
- Keywords for Varahamihira Jataka Paddhati, Varahamihira Jataka Paddhati, Varahamihira, Jatakam, Varahamihira Model, Varahamirudu, Jyotishyam, Jotisham, Jyothisham, Mohan Publications, P.K.Sudarshan, A. Umamaheswara Rao, Mohan Publications, Bruhajjataka Paddhati,