Sarvartha Chintamani Telugu

సర్వార్థ చింతామణి
      – వెంకటేశ్వర దైవజ్ఞ

వావిళ్ళ వారి ప్రాచీన ప్రతి
Pages : 420 

450.00

Share Now

Description

Sarvartha Chintamani Book (Venkateswara Daivagna)

సర్వార్థ చింతామణి (వెంకటేశ్వర దైవజ్ఞ)

Pages : 420

    ఇది పరాశర సంహిత, జైమిని సంహిత నుండి క్రోడీకరింప బడిన అతి ప్రాచీన జ్యోతిష్య శాస్త్ర గ్రంథం… ఈ గ్రంథంలా జ్యోతిష్య శాస్త్రం గురించిన వివరాలు వేరే ఏ ఇతర గ్రంథాలలో లభ్యంకావు… శాస్త్రము అభ్యసించిన పండితులకు మాతమే కాదు… క్రొత్త గా శాస్త్రం నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉన్నవారికి ఎంతో ఉపయోగకరమైనది ఈ  గ్రంధం..

రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు మహాదశల ఫలితములు, తెలుసుకొను విధానములు చక్కగ చెప్పబడెను. తరువాత సాముదాయక అంతర్దశాఫలితములుకూడ విపులముగ చెప్పబడినవి, ఆవిధముగ జాతక ఫలితములు పూర్తిగా తెలుసుకొనుటకు వీలుగా ఈ గ్రంధములో సంజ్ఞాధ్యాయము, ద్వాదశ భావ ఫలితములు, దశాఫలితములు, దశాంతర్దశాఫలితములు ప్రతివారికి సులభముగ బోధపడునట్లు తెలిపబడింది. అనగా జాతకభాగమంతయు యీ ఒక్క గ్రంధములోనే చెప్పబడెను.

ఈ గ్రంధము చదివినచో జాతక భాగమంతయు పూర్తిగా తెలుస్తుంది. అందుచే దీనితో సమానమైన గ్రంధము వేరొకటి లేదు. పరా శర్యము, జైమిని మొదలగు పద్ధతులన్నియు క్రోడీకరించి, జై ఈ గ్రంధము వ్రాసినట్లు తెలియుచున్నది.

జ్యోతిష శాస్త్రము అతి ప్రాచీనమైన భారతీయ విజ్ఞానశాస్త్రము. ఈశాస్త్రము మన మతగ్రంధములైన వేదములలో చెప్పబడియున్నది. ఈ శాస్త్రము పురాతనమునుండియు శాఖోపశాఖలుగా విస్తరింపబడి నదై, వివిధ విషయములను లోకహితముగ తెలియజేయుటకు సాధన ముగ యున్నది. ఆకాశమందు సంచరించు గ్రహముల, నక్షత్రముల సంబార విశేషములను తెలుపునది సిద్ధాంత భాగము.

గ్రహములయొక్కయు, నక్షత్రములయొక్కయు రశ్మిప్రభా వమువలన ప్రాణికోటిపై కలుగబోవు శుభాశుభ ఫలితములు తెలియ జేయునది:జాతక భాగమనబడుచున్నది.
మరియు భూమండలముపై పరిపాలకుల గురించియు, కలుగబోవు ప్రపంచ ఉపద్రవములను గురించియు, వర్షముల గురించియు, వాతా వరణముల గురించియు, సస్యముల వృద్ధి, క్షయములు గురించియు, భూకంపము మొదలగు ఉపద్రవములను గురించియు, యింకను అనేక విషయముల గురించి తెలియజేయు భాగము సంహిత జ్యోతిష భాగ మనియు, యీ శాస్త్రము మూడు భాగములుగ విభజింపబడినది. ఈ శాస్త్రమునకు మన దేశమందేగాక, ప్రపంచములో సమస్త దేశముల యందును విశిష్ఠస్థానము కలదు. దైవజ్ఞుడు లేని దేశములో ప్రభువు దైవజ్ఞులను తమ దేశమునందుంచుకొని, పోషించవలయునని చెప్పబడియున్నది.

జ్యోతిష శాస్త్రము, ఆయుర్వేదము, గణిత శాస్త్రము, వేదాంతము, మొదలగు శాస్త్రములు అభ్యసించుటవలన మానవులకు విజ్ఞాన నేత్రము వికసించును. అట్టి విజ్ఞానశక్తితో పురుషార్థములైన ధర్మార్థ, కామ, మోక్షములను చతుర్విధ పురుషార్ధములను సులభముగా సాధించ వచ్చును. బహుశాస్త్ర పరిశీలన లేని జీవితము పశుజీవితములో సమానమువంటిది. ఈ శాస్త్రజ్ఞానము లేనివారు కూపస్థమండూకము వలె నుందురు.

Sarvardha Chintamani Telugu